చోడవరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live
అనకాపల్లి జిల్లాలోని అసెంబ్లీ నియోజకర్గాల్లో చోడవరం ఒకటి. ఇక్కడ కరణం ధర్మశ్రీ ఎమ్మెల్యేగా వున్నారు. 2019లో వైకాపాను గెలిపించిన ఆయనకే ఈసారి కూడా టికెట్ దక్కింది. మరి టిడిపి వరుస విజయాలకు బ్రేక్ వేసిన ధర్మశ్రీని మరోసారి గెలిపిస్తారా? లేక టిడిపి మళ్ళీ పట్టు సాధిస్తుందా? రాజకీయాల్లో రచ్చ రేపింది.
చోడవరం నియోజకవర్గ రాజకీయాలు :
చోడవరం నియోజకవర్గంలో గత ఎన్నికలను పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ బలంగా వుందని అర్థమవుతుంది. ఇక్కడ టిడిపి ఆవిర్భావం తర్వాత 1983లో జరిగిన మొదటి ఎన్నికల్లోనే గూనూరు యెర్రునాయుడు గెలిచారు. ఆ తర్వాత 1985, 1994 లో కూడా మళ్ళీ టిడిపిదే విజయం. 2004 లో గంటా శ్రీనివాసరావు... 2009, 2014 లో కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజు టిడిపి నుండి పోటీచేసి గెలిచారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసిపి హవా వీచింది... దీంతో చోడవరంలొ కూడా ఆ పార్టీయే గెలిచింది. వరుసగా రెండుసార్లు టిడిపి చేతిలో ఓడిన కరణం ధర్మశ్రీ ఎట్టకేలకు చోడవరంలో విజయం సాధించారు.
చోడవరం నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. చోడవరం
2. బుచ్చయ్యపేట
3. రావికమతం
4. రోలుగుంట
చోడవరం అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,10,806
పురుషులు - 1,02,977
మహిళలు - 1,07,816
చోడవరం అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ మరోసారి చోడవరం బరిలో కరణం ధర్మశ్రీని నిలిపింది. గత ఎన్నికల్లో గెలిచిన ఆయనయితే మళ్లీ టిడిపిని ఓడించగలడన్న నమ్మకంతో వైఎస్ జగన్ వున్నట్లున్నారు. అందుకే చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ లను మార్చినా చోడవరం అలాంటి ప్రయోగం చేయలేదు.
టిడిపి అభ్యర్థి :
తెలుగుదేశం పార్టీ కూడా మాజీ ఎమ్మెల్యే కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజును చోడవరం పోటీలొ నిలిపింది. ఆయన 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించి 2019 లో ఓటమిపాలయ్యారు.
చోడవరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
చోడవరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
చోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల్లో వైసీపీకి చెందిన కరణం ధర్మశ్రీ పై టీడీపీకి చెందిన KSNS రాజు విజయం సాధించారు. కాగా ఈ ఎన్నికల్లో కరణం ధర్మశ్రీ 67,462 ఓట్లు పొందగా.. KSNS రాజు 1,09,651 ఓట్లు సాధించారు.
చోడవరం అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,77,232 (84 శాతం)
వైసిపి - కరణం ధర్మశ్రీ - 94,215 ఓట్లు (53 శాతం) - 27,637 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజు - 66,578 ఓట్లు (38 శాతం) - ఓటమి
చోడవరం అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,66,583 ఓట్లు (84 శాతం)
టిడిపి - కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజు - 80,560 (48 శాతం) - 612 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - కరణం ధర్మశ్రీ - 79,948 (48 శాతం) - ఓటమి
- Andhra Pradesh Assembly Elections 2024
- Andhra Pradesh Congress
- Andhra Pradesh Elections 2024
- BJP
- Chodavaram Assembly
- Chodavaram Politics
- Chodavaram assembly elections result 2024
- Congress Party
- JSP
- Janasena
- Janasena Party
- KSNS Raju
- Kalidindi Suryanaga Sanyasi Raju
- Karanam Dharmasri
- Nara Chandrababu Naidu
- Pawan Kalyan
- TDP
- TDP Janasena Alliance
- Telugu Desam party
- Telugu News
- YCP
- YS Jaganmohan Reddy
- YSRCP