లాక్‌డౌన్ ఉల్లంఘన: వెరైటీ శిక్ష విధించిన చిత్తూరు పోలీసులు
లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినవారికి చిత్తూరు జిల్లా పోలీసులు వినూత్న శిక్షను విధించారు. కరోనాపై పరీక్ష నిర్వహించారు.
చిత్తూరు: లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినవారికి చిత్తూరు జిల్లా పోలీసులు వినూత్న శిక్షను విధించారు. కరోనాపై పరీక్ష నిర్వహించారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా లాక్‌డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. అత్యవసర పరిస్థితుల్లోనే రోడ్లపైకి రావాలని ప్రజలను ప్రభుత్వాలు కోరుతున్నాయి.
also read:కన్నా...! కాణిపాకం ఎప్పుడొస్తున్నావు: ట్విట్టర్‌లో విజయసాయి రెడ్డి
అవసరం ఉన్నా లేకున్నా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు.అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారికి దేశంలోని పలు రాష్ట్రాల పోలీసులు వినూత్నమైన శిక్షలను విధిస్తున్నారు. ఇదే తరహాలో చిత్తూరు జిల్లా పోలీసులు కూడ వెరైటీ శిక్షను విధించారు.
కరోనాకు సంబంధించిన పలు ప్రశ్నలను ఇచ్చి వాటికి సమాధానాలు రాయాలని కోరారు. లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిని వరుసగా కూర్చోబెట్టి పరీక్షలు రాసే అభ్యర్థులకు మాదిరిగానే ప్రశ్నా పేపర్లు ఇచ్చి వారితో జవాబులు రాయించారు.
ఈ ప్రశ్నలకు జవాబులు రాసిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపుతున్నారు. సరైన సమాధానాలు రాయనివారికి కూడ కౌన్సిలింగ్ ఇచ్చి జరిమానాలు విధించనున్నారు.