చిత్తూరు: చిత్తూరు అమ్మాయితో ప్రేమలో పడిన అమెరికా అబ్బాయి ఆమెను పెళ్లి చేసుకొనేందుకు అమెరికా నుండి  వచ్చారు. హిందూ సంప్రదాయం ప్రకారంగా చిత్తూరులో ఈ వివాహం జరిగింది.

అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రానికి చెందిన పీటర్ గ్రెయినర్, షారౌన్‌ల కుమారుడు అండ్రూ గ్రెయినర్.  చిత్తూరు జిల్లా కొంగారెడ్డిపల్లె ఉషానగర్‌ కాలనీకి చెందిన సుధాకర్, కుమారీల కుమార్తె శ్రీనిరీషలు ప్రేమించుకొన్నారు.

2013లో ఎంఎస్  చదువుకొనేందుకు శ్రీనిరీష అమెరికాలోని మిచిగాన్ యూనివర్శిటీలో చేరారు. ఆ సమయంలో  సహ విద్యార్థిగా ఉన్న అండ్రూ గ్రెయినర్‌తో స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత అక్కడే ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో చేరారు. ఇద్దరూ ప్రేమించుకొన్నారు. రెండు కుటుంబాలు ఒప్పుకోవడంతో పెళ్లికి ముహుర్తం కుదిరింది.ఇటీవల అమెరికాలో ఎంగేజ్‌మెంట్ జరిగింది. రెండు రోజుల క్రితం హిందూ సంప్రదాయం ప్రకారం ఇద్దరి పెళ్లి జరిగింది.