Asianet News TeluguAsianet News Telugu

2019 ఎన్నికల్లో సీకే బాబు దారెటు.....

ఎన్నికల సమరం స్టార్ట్ అయ్యింది. పొలిటికల్ వార్ లో సత్తా చాటేందుకు నేతలు అప్పుడే రెడీ అయిపోయారు. 2019లో గెలుపే పరమావధిగా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇకపోతే ఇప్పటి వరకు ఏ పార్టీలోకి వెళ్లకుండా స్తబ్ధుగా ఉన్ననేతలు సైతం తెరపైకి వస్తున్నారు. ఆయా పార్టీలో చేరి ఇప్పటికే బెర్త్ లు కన్ఫమ్ చేసుకుంటున్నారు....

Chittoor ex mla ck babu future political plan
Author
Chittoor, First Published Aug 26, 2018, 3:19 PM IST

చిత్తూరు: ఎన్నికల సమరం స్టార్ట్ అయ్యింది. పొలిటికల్ వార్ లో సత్తా చాటేందుకు నేతలు అప్పుడే రెడీ అయిపోయారు. 2019లో గెలుపే పరమావధిగా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇకపోతే ఇప్పటి వరకు ఏ పార్టీలోకి వెళ్లకుండా స్తబ్ధుగా ఉన్ననేతలు సైతం తెరపైకి వస్తున్నారు. ఆయా పార్టీలో చేరి ఇప్పటికే బెర్త్ లు కన్ఫమ్ చేసుకుంటున్నారు....

అయితే చిత్తూరు జిల్లాలోని ఓ మాజీ ఎమ్మెల్యే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఏం చెయ్యలో తెలియని సంకట పరిస్థితి ఎదుర్కొంటున్నారట. ఇప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీకే బాబు తన రాజకీయ భవితవ్యంపై ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారట. 2019 ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని మాంచి ఊపుమీదున్న సీకే బాబుకు బీజేపీతో అయితే గెలుపు సాధ్యం కాదని భావిస్తున్నారట. 

ప్రస్తుతం బీజేపీలో కీలక నేతగా ఉన్న సీకే బాబు బీజేపీకి రాం రాం చెప్పేందుకు రెడీ అవుతున్నారట. గత కొద్దికాలంగా ప్రజాజీవితానికి దూరంగా ఉన్న ఆయన ఈసారి మాత్రం ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని మంచి కసితో ఉన్నారు. అయితే బీజేపీతో అయితే తన గెలుపు సాధ్యం కాదని భావిస్తున్న సీకే బాబు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే అటు వైసీపీ నుంచి కానీ ఇటు అధికారపార్టీ టీడీపీ నుంచి కానీ ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో పడ్డారు.  

చిత్తూరు జిల్లాలోని మాస్ నాయకులలో సీకే బాబు ఒకరు. చిత్తూరు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు గెలుపొందిన ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. స్వతంత్ర్య అభ్యర్థిగా గెలుపొందిన ఆయన ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న బంధంతో కాంగ్రెస్ లో కొనసాగారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరడంతో ఆయనకు జగన్ సీట్ ఇవ్వలేదు. దీంతో వైసీపీ అభ్యర్థి జంగాలపల్లె శ్రీనివాసులుకు మద్దతు పలికారు. 

చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానై వ్యవహరిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సీకే బాబుకు ఉన్నరాజకీయ విభేదాలతో ఉప్పు నిప్పులా ఉన్నారు. వైఎస్ఆర్ కు అసలైన వారసులం తామేనంటూ సీకే బాబు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. వారసులమంటూ నిర్వహించిన భారీ ర్యాలీ కూడా సంచలనమే. ఈ నేపథ్యంలో సీకే బాబుకు వైసీపీతో ఎలాంటి సంబంధం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అంతేకాదు మున్సిపల్ ఎన్నికల్లో సీకే బాబు వర్గం ఘోర పరాజయం చవిచూసింది. సాక్షాత్తు ఆయన భార్య ఓటమిపాలైంది. దీంతో అప్పటి నుంచి ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. 

 ఆ తర్వాత సీకే బాబు టీడీపీలోకి వెళ్దామని ప్రయత్నించినా అవకాశం కుదరకపోవడంతో బీజేపీలో చేరారు. దగ్గుబాటి పురంధేశ్వరి రాయబారంతో బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ టీడీపీ పొత్తు ఉండటంతో 2019 ఎన్నికల్లో పోటీ చేద్దాం అని భావించారు. అనూహ్యంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎన్డీఏ నుంచి బయటకు రావడంతో ఆయన ఆశలు సన్నగిల్లాయి. 

2019 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చెయ్యాలని సీకే బాబు భావిస్తున్నారు. అయితే చిత్తూరు జిల్లాలో వైసీపీ బలంగా ఉండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని ఆయన అనుచరగణం ఒత్తిడి తెస్తోంది. అయితే వైసీపీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఉన్న రాజకీయ పోరు ఎంట్రీకి కష్టంగా మారే అవకాశం ఉందని టాక్. వైసీపీలోకి వెళ్లాలని క్యాడర్ సూచిస్తున్నప్పటికీ....పెద్ది రెడ్డి నుంచి వ్యతిరేకత తప్పడం లేదట. దీంతో పెద్ది రెడ్డి తనకు సృష్టిస్తోన్న అడ్డంకులను తొలగించుకుని వైసీపీలోకి చేరాలని ప్లాన్ చేస్తున్నారని మరో టాక్. 

టీడీపీలోకి వెళ్దామంటే అక్కడ నుంచి కూడా ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో సీకే బాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. మరోవైపు సీకే బాబు పార్టీ వీడి వెళ్లరని బీజేపీ ధీమాగా ఉంది. మరి 2019లో సీకే బాబు దారెటో అన్నది ఆసక్తిగా మారింది. 

  

Follow Us:
Download App:
  • android
  • ios