ఒంగోలు: తనకు ఓట్లు వేయలేదని కొందరిని ఇబ్బంది పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పై చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం పరోక్షంగా విమర్శలు గుప్పించారు. 

శుక్రవారం నాడు చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్ మీడియాతో మాట్లాడారు.జగన్ గాలిలోనే చీరాల ప్రజలు టీడీపీ అభ్యర్ధిగిని గెలిపించారంటే  అవతలి వ్యక్తిపై ఉన్న వ్యతిరేకతను అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

పనుల కోసం వచ్చేవారితో సరిగా మాట్లాడే పద్దతిని ప్రజా ప్రతినిధులు నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు.ఓట్లు వేయలేదని కొంతమందిని ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో చీరాల ప్రజలు భయపడాల్సిన పని లేదని ఆయన భరోసా ఇచ్చారు.

ఎవరో వచ్చి ఇబ్బందులు పెడుతుంటే చూస్తూ ఊరుకోనని చెప్పారు. 2019 ఎన్నికల్లో చీరాల నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన కరణం బలరామ్ విజయం సాధించారు.

 వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన ఆమంచి కృష్ణమోహన్ పై బలరాం గెలుపొందారు.ఇటీవల కాలంలో కరణం బలరాం టీడీపీని వీడి వైసీపీకి మద్దతు పలికారు. బలరాం తనయుడు కరణం వెంకటేష్ వైసీపీలో చేరారు.