విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మానిటరింగ్ చైర్మన్ పార్థసారథి బుధవారంనాడు జనసేనకు రాజీనామా చేశారు. తన పదవికి, పార్టీకి ఆయన గుడ్ బై చెప్పారు. 

గత ఎన్నికల్లో అనకాపల్లి లోకసభ స్థానం నుంచి పోటీ చేసి పార్థసారధి ఓడిపోయారు. కేవలం 82,588 ఓట్లు మాత్రమే ఆయనకు పోలయ్యాయి. అంటే 6.67 శాతం ఓట్లు ఆయనకు వచ్చాయి. పవన్ కల్యాణ్ వ్యవహార శైలిపై ఆయన గత కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

తన రాజీనామా లేఖను పార్థసారథి పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు పంపించారు. ఆయన ఏ పార్టీలో చేరుతారనే విషయం తెలియడం లేదు. కృష్ణా జిల్లా జనసేన కన్వీనర్ పాలడుగు డేవిడ్ రాడు ఆదివారంనాడు కన్నా లక్ష్మినారాయణ సమక్షంలో బిజెపిలో చేరారు. 

కావలి శాసనసభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పసుపులేటి సుధాకర్ ఆగస్టు 1వ తేదీన ఢిల్లీ వెళ్లి బిజెపిలో చేరారు.