బహుశా పన్నీర్ సెల్వం, గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు తదితరులకు వ్యతరేకంగా శపధం చేసినట్లే కనబడింది.

ఓ వైపు క్రోధం. ఇంకోవైపు ఉక్రోషం. అదే సమయంలో ఆవేదన. కళ్ళల్లో నీళ్ళు. అన్నీ కలగలసిన నేపధ్యంలో చిన్నమ్మ శపధం చేసారు. బెంగుళూరుకు సమీపంలోని పరప్పర జైలుకు తరలి వెళ్లేందుకు ముందు జయలిలత సమాధి వద్ద అంజలి ఘటించారు. అదే సందర్భంలో సమాధి వద్ద పూలు వేసిన తర్వాత నాటకీయంగా మూడుసార్లు గట్టిగా చరిచి శపధం చేసారు. బహుశా పన్నీర్ సెల్వం, గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు తదితరులకు వ్యతరేకంగా శపధం చేసినట్లే కనబడింది. మంగళవారం రాత్రికే బెంగుళూరుకు వెళ్లిపోవాల్సిన శశికళ బుధవారం మధ్యాహ్నానికి గానీ బయలుదేరలేదు. చిన్నమ్మతో పాటు మరదలి కొడుకు సుధాకరన్, వొదిన ఇళవరసి కూడా ఒకే వాహనంలో బెంగుళూరు కోర్టుకు బయలుదేరారు.

అనారోగ్యం కారణంగా లొంగిపోవటానికి నాలుగువారాల పాటు సమయం కావాలని చిన్నమ్మ చేసిన విజ్ఞప్తిని సుప్రింకోర్టు తిరస్కరించింది. దాంతో శశికళ మొహంలో ఆగ్రహం, నిరాస స్పష్టంగా కనబడింది. అదే సందర్భంలో పార్టీ కార్యవర్గంలో కొన్ని మార్పులు చేసారు. పార్టీ చరిత్రలోనే తొలిసారిగా డిప్యుటి జనరల్ సెక్రటరీ పదవిని సృష్టించారు. ఆ పోస్టులో తన మేనల్లుడు టిటివి దినకరన్ను నియమించారు. తాను లేని సమయంలో కూడా పార్టీపై తన పట్టు సాగేందుకు వీలుగా తన కుటుంబసభ్యులనే కీలక పదవుల్లో శశికళ నియమించారు.