జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప.. సంచలన కామెంట్స్ చేశారు. పవన్ నిర్వహించే సభలకు జనాలు వస్తారు కానీ.. వారంతా ఎన్నికల్లో ఆయనకు ఓట్లు వేయరని చినరాజప్ప అభిప్రాయపడ్డారు.

బీజేపీ, జగన్‌, పవన్‌ కలిసి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు హయాంలోనే న్యా యం జరిగిందని ఆయన వివరించారు. ఉత్తరాంధ్రలోనే పవన్ తన యాత్ర ప్రారంభించాలని.. ఆయనకు సూచించింది బీజేపీనే అని ఆయన ఆరోపించారు.

పవన్ యాత్ర మొత్తం బీజేపీ డైరెక్షన్ లోనే సాగుతోందని ఆయన అన్నారు.  పవన్‌ ఇప్పుడు వెళ్లి ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందలేదని అంటున్నారని.. ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి పవన్‌కేం తెలుసని నిలదీశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్న బీజేపీ నేతల డిమాండ్‌ను ఆయన కొట్టిపారేశారు. రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశమేలేదన్నారు.