అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ హోంశాఖ మంత్రి డిప్యూటీ సీఎం చినరాజప్ప నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ కు ఏం రాజకీయ అనుభవం ఉందని నిలదీశారు. రాజకీయ అనుభవం లేకపోవడం వల్లే అందరూ దొంగలే అంటున్నారని మండిపడ్డారు. 

పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్న వాళ్లంతా నిఖార్సైన వాళ్లేనని చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు. ఇష్టం వచ్చినట్లు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయోద్దని హితు పలికారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో చంద్రబాబు అభివృద్ధి చేస్తుంటే అది పవన్ కు కనిపించడం లేదా అని నిలదీశారు. మరోవైపు రాజకీయ దురుద్దేశంతోనే సుజనాచౌదరిపై ఈడీ దాడులకు పాల్పడుతుందని చినరాజప్ప ఆరోపించారు. 

కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో సుజనా చౌదరిపై ఈడీ దాడులకు పాల్పడ లేదని ఎప్పుడైతే ఎన్డీఏ నుంచి భయటకు వచ్చామో అప్పుడే దాడులకు పాల్పడిందని ఇదంతా రాజకీయ వేధింపులు కాకపోతే ఇంకేంటని కేంద్రాన్ని నిలదీశారు చినరాజప్ప.