కాపు కార్ఫోరేష‌న్ ఛైర్మ‌న్ కి అవమానం జరిగింది. అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి స‌మ‌క్షంలోనే కాపు కార్ఫోరేష‌న్ ఛైర్మ‌న్ రామానుజ‌య‌ వద్ద మైక్‌ లాగుకున్న చినరాజప్ప రామానుజయ ఖంగుతున్నారు. కాపునేత‌లంద‌రు నివ్వేర పోయారు
కాపు నేతల సభలో కాపు కార్ఫోరేషన్ ఛైర్మన్ కి అవమానం జరిగింది. అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలోనే, సోమవారం విజయవాడలోని ది వేన్యూ ఫంక్షన్ హాల్ లో సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో రామానుజయ మాట్లాడుతు ముద్రగడ ప్రస్థావన తెచ్చారు. కాపు రిజర్వేషన్ కోసం ముద్రగడ పద్మనాభం ఆందోళన చేస్తున్న విషయం అందరికి తెలిసిందే, తన ఆందోళనలో భాగంగా గతంలో నిరహార దిక్ష కూడా చేశారు, అదే విషయాన్ని రామానుజయ ప్రస్థావిస్తు ముద్రగడ దీక్షను ఎద్దేవా చేస్తు మాట్లాడుతున్నారు. రామానుజయ ముద్రగడ గురించి మాట్లాగటం మొదలు పెట్టగానే, వేదిక మీదనే ఉన్న హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హఠాత్తుగా లేచి, రామానుజయ వద్ద మైక్ లాక్కున్నారు. చినరాజప్ప ఇలా వ్యవహరించడంతో రామానుజయ ఖంగుతున్నారు. ఆ ఘటన చూసిన కాపునేతలందరు నివ్వేర పోయారు. కాపు నేతల సమావేశంలోనే కాపు కార్ఫోరేషన్ ఛైర్మన్ను మాట్లాడినీయకుండా..మైక్ లాగేసుకొవడాన్ని పలువులు ఆక్షేపించారు.
అసలే ముద్రగడ చంద్రబాబు మీద ప్రభుత్వం మీద ఓంటి కాలు మీద లేస్తున్నారు, ఒకవైపు నంద్యాల, కాకినాడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో టీడిపీకి వ్యతిరేఖంగా ఓటు వేయాలని కాపులకు ముద్రగడ పిలుపునిచ్చిన సంగతి అందరికి తెసిందే.. ఈ నేపథ్యంలో జరిగిన సమావేశంలో ముద్రగడ వ్యతిరరేఖంగా ఎవరైనా మాట్లాడితే టీడీపీ కొంప మునడనగం ఖాయం. ఆ భయంతతోనే చిన రాజప్ప రామానుజయ నుండి మైక్ లాగేసుకున్నట్లు తెలుస్తుంది.
