ఒంగోలు: ప్రకాశం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత, పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సన్నిహితుడు చంద్రశేఖర్ యాదవ్  జనసేనలో  చేరనున్నారు. ఈ మేరకు ఆయన పవన్ కళ్యాణ్‌తో కూడ చర్చించారు. పవన్ కూడ చంద్రశేఖర్  చేరికకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

జిల్లాలోని  గిద్దలూరు నియోజకవర్గం నుండి 2009 ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రశేఖర్ యాదవ్  ఆ ఎన్నికల్లో పీఆర్‌పీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.  అయితే రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో  చంద్రశేఖర్ యాదవ్  జనసేనలో చేరాలని  నిర్ణయం తీసుకొన్నారు.

జనసేనలో చేరాలని చంద్రశేఖర్ యాదవ్ ను కొందరు ఆ పార్టీ నేతలు సంప్రదించారు. దీంతో  చంద్రశేఖర్ కూడ సానుకూలంగానే స్పందించారు. పవన్ కళ్యాణ్‌తో కూడ సమావేశమై పార్టీలో చేరే విషయమై ఆయన చర్చించారు. చంద్రశేఖర్ చేరికకు పవన్ కూడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

చంద్రశేఖర్ యాదవ్  డిసెంబర్ 18వ తేదీన హైద్రాబాద్ లో జనసేన ముఖ్య నాయకులతో  కలిసి చర్చించారు. ఒంగోలులోని తన కార్యాలయాన్ని జనసేన  పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసేందుకుచంద్రశేఖర్ యాదవ్ నిర్ణయం తీసుకొన్నారు. పవన్ కళ్యాణ్ అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత   చంద్రశేఖర్ యాదవ్  జనసేనలో చేరనున్నారు.