Asianet News TeluguAsianet News Telugu

తిరుపతి: వరద బాధితుల ఆకలిబాధను తీర్చెందుకు... హమాలీగా మారిన వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి

భారీ వర్షాలతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఆకలిబాధతో అలమటించకుండా హమాలీగా మారి నిత్యావసర సరుకుల బస్తాలను మోసారు చంద్రగిరి వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. 

Chandragiri YCP MLA Chevireddy Bhaskar Reddy Helping Rayala Cheruvu Flood Ravaged Villages
Author
Tirupati, First Published Nov 24, 2021, 10:09 AM IST

తిరుపతి: ఆంధ్ర ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు భారీగా చేరి నదలు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అలాగే జలాశయాలు, చెరువుల్లో భారీగా నీరు భారీగా చేరడంతో కట్టలు తెంచుకుని జనావాసాల్లోకి నీరు చేరుతోంది. ఇలా ఇటీవల చిత్తూరు జిల్లాలో కురిసిన కుండపోతకు తిరుపతి సమీపంలోని రాయలచెరువు ప్రమాదకరంగా మారింది. దీంతో వరదనీటితో పలు గ్రామాలు మునకకు గురవగా... బాధిత ప్రజానికానికి స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నిరకాలుగా అండగా నిలిచారు. 

rayala cheruvu వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ముంపుకు గురయిన ప్రాంతాల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దగ్గరుండి అన్నిచర్యలు తీసుకున్నారు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి. చివరకు హమాలీగా మారి బస్తాలను కూడా మోసారు chevireddy bhaska reddy.

రాయలచెరువు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో YSRCP Government  నిత్యావసర సరుకులను ప్రజలకు పంపిణీ చేస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ramachandrapuram మండలంలోని 11 గ్రామాల కోసం 10 టన్నుల నిత్యావసర సరుకులు వచ్చాయి. అయితే వీటిని హెలికాప్టర్ లోంచి కిందకు దించడానికి స్వయంగా చెవిరెడ్డే రంగంలోకి దిగారు. భుజంపై బస్తాలను మోస్తూ హమాలీగా మారిన చెవిరెడ్డి ప్రజల ఆకలిబాధను తీర్చారు. 

READ MORE  Rayala Cheruvu: చిత్తూరు జిల్లాలో ప్రమాదపు అంచున రాయలచెరువు.. 100 గ్రామాలకు పొంచి ఉన్న ముప్పు.. !

ఇక గత రెండురోజులుగా చెవిరెడ్డి రాయలచెరువు వద్దే వుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించారు. వర్షాల కారణంగా పూర్తిగా నిండిపోవడంతో చెరువుకు స్వల్ప గండి పడి వరదనీరు లీక్ కావడం చుట్టుపక్కల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దీంతో వారికి ధైర్యం ఇచ్చేలా ఎమ్మెల్యే చెవిరెడ్డి పగలూ రాత్రి అక్కడే వుండి స్నానం, భోజనం అన్నీ అక్కడే చేసారు. ఇలా దగ్గరుండి ఇప్పటికే చెరువుగట్టును పటిష్టం చేసే పనులను పర్యవేక్షించి ఎలాంటి ప్రమాదం లేకుండా జాగ్రత్తపడ్డారు.

రాయలచెరువు వల్ల ఎలాంటి ఉపద్రవం చోటుచేసుకోకుండా ముందస్తుగానే ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్  బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు ప్రజలను అధికారులు అప్రమత్తం చేసారు. ఇప్పటికే పలు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ పునరావాస కేంద్రాల్లోని ప్రజలతో పాటు వివిధ గ్రామాల్లోని ప్రజలు ఆకలితో అలమటించకుండ ప్రభుత్వమే నిత్యావరసర సరుకులు అందిస్తోంది. ఈ క్రమంలోనే హెలికాప్టర్ లో వచ్చిన సరుకులను ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు ఆయన అనుచరులు కిందకుదించారు.

READ MORE  నెల్లూరు వరదలు : బాలినేనికి నిరసన సెగ.. మధ్యలోనే వెళ్లిపోయిన మంత్రి (వీడియో)

రాయలచెరువులో వరద ఉధృతి పరిశీలించేందుకు పలుమార్లు హెలికాప్టర్ ద్వారా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరి నారాయణ, అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, ఇరిగేషన్ శాఖ అధికారులు ఏరియల్ సర్వే చేపట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని... రాయలచెరువుకు గండిపడే ప్రమాదాన్ని నిలువరించినట్లు తెలుస్తోంది. 

ఇదిలావుంటే దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని Department of Meteorology ప్రకటించింది. దీని ప్రభావం శ్రీలంక-దక్షిణ తమిళనాడుపై తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తుంది. ఈ అల్పపీడన ప్రభావం తమిళనాడు ఎక్కువగా ఉన్నప్పటికి చిత్తూరు, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios