రజనీకాంత్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు చేసిన ప్రకటనను టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు స్వాగతించారు.

గురువారం నాడు అమరావతిలో చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు.రాజకీయాల్లోకి రజనీకాంత్ రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు వస్తే మంచిదేనని ఆయన అన్నారు.

also read:తమిళనాడును సమూలంగా మారుస్తా,విజయం మాదే: రజనీకాంత్ ధీమా

రజనీకాంత్ పార్టీని ఏర్పాటుపై ఇవాళ ప్రకటించారు. డిసెంబర్ 31న రాజకీయ పార్టీ గురించి పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఆయన తెలిపారు.వచ్చే ఏడాది తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని రజనీకాంత్ ఆకాాంక్షను వ్యక్తం చేశారు. రజనీకాంత్ తనకు మంచి మిత్రుడని ఆయన గుర్తు చేశారు. 

ఇటీవల కాాలంలో అభిమానులతో రజనీకాంత్ సమావేశాలు  నిర్వహించారు. ఈ సమావేశాల తర్వాత పార్టీ ఏర్పాటు విషయమై గురువారం నాడు ఆయన స్పష్టత ఇచ్చారు. చాలా కాలంగా పార్టీ ఏర్పాటు చేస్తానని రజనీకాంత్ చెబుతున్నారు. కానీ ఈ విషయాన్ని ఇవాళ కుండబద్దలు కొట్టారు. 

ఇప్పటికే తమిళనాడులో కమల్ హాసన్ ఓపార్టీని ఏర్పాటు చేశారు.కమల్ హాసన్ పార్టీ గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసింది. వచ్చే ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రజనీకాంత్ పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించడం ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో  ప్రాధాన్యత సంతరించుకొంది.