అమరావతి: టీడీపీలో చోటు చేసుకొన్న పరిణామాలపై పార్టీ నేతల్లో ధైర్యం కల్పించేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నాలను ప్రారంభించారు. టీడీపీ నేతలతో విదేశాల నుండి చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు సాయంత్రం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. గురువారం నాడు కాకినాడలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు హోటల్‌లో సమావేశం కావడంతో పాటు రాజ్యసభలో టీడీపీపీని బీజేపీలో విలీనం చేయడంపై చంద్రబాబు పార్టీ నేతలతో ఫోన్‌లో చర్చించారు.

పార్టీ సీనియర్లతో ఫోన్‌లో గురువారం నాడు ఎప్పటికప్పుడు చర్చించారు.చంద్రబాబునాయుడు గురువారం నాడే  పార్టీ క్యాడర్‌కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే శుక్రవారం నాడు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

రాజ్యసభలో టీడీపీపీని బీజేపీలో విలీనం చేయడాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలు  పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.  బాబుతో టెలికాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు గాను కొందరు నేతలు అమరావతికి చేరుకొన్నారు.