అమరావతి: కేసుల కోసం భయపడి పోలవరం విషయంలో కేంద్రానికి  రాష్ట్రప్రభుత్వం భయపడుతోందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు.

కేసుల కోసం భయపడి పోలవరాన్ని నిర్లక్ష్యం చేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. బుధవారం నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు.

పోలవరం విషయంలో వైసీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం  చేస్తోందన్నారు. రివర్స్ టెండరింగ్ తో భారీ నష్టం వాటిల్లుతోందన్నారు.నీళ్లు లేకుండా పవర్ ప్రాజెక్టు ఏం చేసుకొంటారని ఆయన ప్రశ్నించారు. ఆరోపణలు చేసే ముందు ఆలోచించి చేయాలన్నారు.

పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రచారం చేశారు.. ఈ విషయాన్ని తాము ప్రశ్నిస్తే  సమాధానం చెప్పకుండా పారిపోయారన్నారు. ఎందుకు అవినీతిని రుజువు చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు.

also read:ఒక్క మీటరు ఎత్తును తగ్గించం: పోలవరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో జగన్

ఆరోపణలు చేసే ముందు ఆలోచించాలని ఆయన హితవు పలికారు. అవినీతికి పాల్పడినట్టుగా నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారన్నారు. చేతనైతే చేసిన ఆరోపణలను రుజువు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

వైఎస్  కంటే ముందుగానే పోలవరం ప్రాజెక్టుకు అంజయ్య శంకుస్థాపన చేశారని ఆయన గుర్తు చేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పోలవరం కాలువలు తవ్వారన్నారు.పోలవరం ప్రాజెక్టును ఎఫ్పటివరకు పూర్తి చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు ఈ ప్రాజెక్టుపై అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.

పోలవరం కాంట్రాక్టును రద్దు చేశారని ఆయన ప్రశ్నించారు. ఆర్ అండ్ ఆర్ ఇవ్వకుండా పవర్ ప్లాంట్ ఎందుకని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలంలో పోలవరం విషయంలో ఏం చేశారని చంద్రబాబు అడిగారు. తప్పుడు పనులు మీరు చేసి మాపై నిందలు వేస్తారా అని ఆయన అడిగారు.

కేంద్రం నుండి నిధులు తెచ్చుకోలేక ఇతరులపై ఏడుస్తున్నారన్నారు.