అమరావతి: తనకు అధికారాలు లేవని సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఇంటర్వ్యూలో చెప్పడంపై వివరణ కోరినట్టుగా  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.

బుధవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు.  ఓ పత్రికలో తనకు అధికారాలు లేవని సీఎస్ సుబ్రమణ్యం చెప్పడాన్ని  ఆయన ప్రస్తావించారు. అధికారాలు లేవని సీఎస్ ఎలా వ్యాఖ్యలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయమై  తాను వివరణ కోరానని ఆయన చెప్పారు. దీనిపై కమ్యూనికేషన్ కొనసాగుతోందన్నారు.

ఈ విషయమై మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ప్రస్తావించారు. టీటీడీకి చెందిన బంగారం విషయంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఓవర్‌యాక్షన్ చేశాడని బాబు మండిపడ్డారు. ఈ విషయమై ప్రజల్లో గందరగోళపర్చేందుకు విపక్ష పార్టీలు కూడ ప్రయత్నించాయని బాబు అభిప్రాయపడ్డారు. 

 గత ఐదేళ్లుగా తప్పులు లేకుండా పనిచేసిన అధికారులకు తాను అండగా నిలిచినట్టుగా బాబు గుర్తు చేశారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకొన్నానని ఆయన ప్రస్తావించారు. అందుకే రాష్ట్రం అన్ని విషయాల్లో నెంబర్‌వన్‌గా నిలిచినట్టుగా ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

పవార్ వ్యాఖ్యల ఎఫెక్ట్: ప్రధాని రేసుపై చంద్రబాబు స్పందన