Asianet News TeluguAsianet News Telugu

మోనార్కా.. పదవి కోసం గౌతం సవాంగ్ జగన్ కు సరెండర్: చంద్రబాబు ఫైర్

 డీజీపీ మోనార్క్ అనుకొంటున్నారా... ఆలయాలపై దాడులు చేసినవారిపై కేసులు పెట్టారా అని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. క్రిస్టియన్ మతాన్ని రోడ్డుపైకి ఈడ్చిందెవరని ఆయన అడిగారు. డీజీపీ పదవి కోసం గౌతం సవాంగ్ ప్రభుత్వానికి సరెండరయ్యారని ఆయన ఆరోపించారు

Chandrababunaidu serious comments on AP DGP Goutham Sawang lns
Author
Guntur, First Published Jan 21, 2021, 10:45 AM IST


విజయవాడ: డీజీపీ మోనార్క్ అనుకొంటున్నారా... ఆలయాలపై దాడులు చేసినవారిపై కేసులు పెట్టారా అని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. క్రిస్టియన్ మతాన్ని రోడ్డుపైకి ఈడ్చిందెవరని ఆయన అడిగారు. డీజీపీ పదవి కోసం గౌతం సవాంగ్ ప్రభుత్వానికి సరెండరయ్యారని ఆయన ఆరోపించారు. విజయవాడలో గురువారం నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. రామతీర్థంలో విజయసాయిరెడ్డి పర్యటనకు ఎలా అనుమతించారని ఆయన ప్రశ్నించారు. 

మాజీ మంత్రి కళా వెంకట్రావు వివాదరహితుడని ఆయన చెప్పారు. డీజీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో  అరాచక పాలన సాగుతోందన్నారు.  కనీసం టాబ్లెట్  వేసుకోనివ్వకుండా అడ్డుకొన్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రతిపక్షాలనుు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు.రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. మమ్మల్ని, ప్రజల్ని జైల్లో పెట్టాలని ఆయన కోరారు. అప్పుడే మీ ఆటలు సాగుతాయన్నారు.

ఏపీలో ఇండియన్ పీనల్ కోడ్  అమలు చేస్తున్నారా జగన్ పీనల్ కోడ్  అమలు చేస్తున్నారా అని చంద్రబాబు డీజీపీని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో టీడీపీ నేతల అరెస్ట్ వీడియోలను చంద్రబాబునాయుడు విలేకరుల సమావేశంలో  చూపారు.

రామతీర్థం తాను పర్యటిస్తున్న సమయంలో  తన వెంట అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు వచ్చారని ఆయన గుర్తు చేశారు. 

ఫాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి వివాదాస్పదంగా మాట్లాడారన్నారు. ప్రవీణ్ చక్రవర్తి ఎక్కడ ఉన్నాడని ఆయన ప్రశ్నించారు. ప్రవీణ్ చక్రవర్తి డీజీపీ ఇంట్లో ఉన్నాడా?, జగన్ ఇంట్లో ఉన్నాడా చెప్పాలని ఆయన కోరారు.

తమ పార్టీ  నేతలను అర్ధరాత్రి పూట ఎందుకు అరెస్ట్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.  కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు.  నోటీసులు ఇవ్వాలనే స్పృహ కూడ లేదా అని ఆయన అడిగారు.

నోటికొచ్చినట్టుగా ఓ మంత్రి తమ పార్టీ నేతలను దూషించారు, కొడతానని హెచ్చరించారు, నాపై కూడ ఇష్టారీతిలో మాట్లాడారని కొడాలి నాని వ్యాఖ్యలను చంద్రబాబు ప్రస్తావించారు. ఈ మంత్రిపై ఏం చర్యలు తీసుకొన్నారని ఆయన అడిగారు. మీ దగ్గర దెబ్బలు తినడానికి ఉన్నామా అని ఆయన  ప్రశ్నించారు. దేవినేని ఉమాను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలన్నారు.

ఎస్పీని తిట్టిన వైసీపీ నేతలపై ఎందుకు కేసులు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.  ప్రజా వేదిక విధ్వంసంతోనే రాష్ట్రంలో అరాచక పాలన మొదలైందని  ఆయన చెప్పారు.ఫాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి లాంటి వాళ్లను జగన్ ఎంతమంది పెట్టారని ఆయన ప్రశ్నించారు. చట్టాన్ని సరిగా అమలు చేయాలని చంద్రబాబు కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios