అమరావతి: ఎన్టీఆర్ నుండి తాను పార్టీని లాక్కొన్నానని కేసీఆర్  చెప్పడాన్ని చంద్రబాబునాయుడు తప్పుబట్టారు..ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేసే  సమయంలో కేసీఆర్ కేసీఆర్ ఎక్కడున్నారు, వైస్రాయి సిద్దాంతకర్త గా ఉన్నారని కేసీఆర్ పై చంద్రబాబునాయుడు సెటైర్లు వేశారు.

ఆదివారం నాడు  ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ నుండి పార్టీని లాక్కొన్నట్టు  చెప్పడాన్ని ఆయన ప్రస్తావించారు. ఆనాడు కేసీఆర్ ఎక్కడ ఉన్నాడో చెప్పాలన్నారు. వైస్రాయ్ సిద్దాంతకర్తగా ఉండి... నడిపించిందే ఆయనే కదా ఆ విషయాలు ఆయనకు తెలియవా అని బాబు ప్రశ్నించారు.

కేసీఆర్ పార్టీలో లేరా అని  ప్రశ్నించారు. నా మంత్రివర్గంలో  కేసీఆర్ పనిచేయలేదా అని  ఆయన ప్రశ్నించారు. మోడీని కేసీఆర్ నెత్తిన పెట్టుకొన్నా తనకు అభ్యంతరం లేదన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఎన్డీఏ నుండి బయటకు వచ్చినట్టు చెప్పారు

సంబంధిత వార్తలు

కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్‌పై బాబు: అంతే వేగంతో గిఫ్ట్ ఇస్తా

ఒక్క కేసు పెడితే నాలుగు కేసులు పెడతా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్

కేసీఆర్‌కు బాబు కౌంటర్: బీజేపీ, వైసీపీలతో కలిసి పోటీ చెయ్యి

.