తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కౌంటర్ ఇచ్చారు. ఏపీలో వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పోటీ చేయాలని  చంద్రబాబునాయుడు కోరారు.

అమరావతి: తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కౌంటర్ ఇచ్చారు. ఏపీలో వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పోటీ చేయాలని చంద్రబాబునాయుడు కోరారు. ఏపీలో కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేసుకోవాలని ఆయన సలహ ఇచ్చారు.

ఆదివారం నాడు అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రూరల్, అర్బన్ డెవలప్‌మెంట్‌‌పై శ్వేత పత్రం విడుదల చేశారు. ఏపీ రాష్ట్రంలో 325 గ్రామాలకు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద నీరు అందిస్తున్నామని ఆయన చెప్పారు. దీని కోసం ఏపీలో 15వేల కోట్లను ఖర్చు చేస్తున్నామన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ హూందాతనాన్ని కోల్పోయి మాట్లాడాడు. రాజకీయ నేతలు అసభ్యంగా మాట్లాడడం సరికాదన్నారు. ఒక పద్దతి లేకుండా మాట్లాడడాన్ని చంద్రబాబునాయుడు తప్పుబట్టారు.

నోరు పారేసుకోవడం హుందాతనాన్ని ఇవ్వద్దన్నారు. కేసీఆర్ వాడిన భాష అభ్యంతరంగా ఉందన్నారు. ఎందుకు ఇంత దారుణంగా కేసీఆర్ మాట్లాడుతున్నారో చెప్పాలన్నారు.

ఏపీలో ఎన్నికల ప్రచారం చేయాలని కేసీఆర్ ను కోరారు. మోడీ, వైసీపీ, బీజేపీలు పొత్తు పెట్టుకోవాలని బాబు కేసీఆర్ కు సూచించారు. కేసీఆర్‌కు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది టీడీపీ కాదా అని ఆయన ప్రశ్నించారు. 

కేసీఆర్ నోరు పారేసుకోవడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. పద్దతి లేని రాజకీయాలను తాను ఎప్పుడూ చేయలేదన్నారు. ఏపీలో కేసీఆర్ పూజలు చేసుకోవడంలో తనకు ఇబ్బంది లేదన్నారు. 

హైద్రాబాద్‌లో సైబర్ టవర్స్‌కు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి శంకుస్థాపన చేశారని ఎవరూ కూడ చెప్పలేదన్నారు. ఐటీ గురించి మాట్లాడిన మొదటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అని ఆయన గుర్తు చేశారు.

ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోలేదా.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలను ఇష్టారీతిలో మాట్లాడడం సరైందా అని ఆయన ప్రశ్నించారు.ఎన్టీఆర్ నుండి పార్టీని లాక్కొన్న సమయంలో కేసీఆర్ ఎక్కడున్నారో అందరికీ తెలుసునని చెప్పారు. ఆ సమయంలో మీరు నాతో లేరా అని ప్రశ్నించారు.మోడీని నెత్తిన పెట్టుకొన్నా మాకేం బాధ లేదన్నారు.

మంచి చేస్తే ఎవరైనా ఫాలో కావాల్సిందేనని చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రత్యేక హోదా కోసం లెటర్ రాస్తానని కేసీఆర్ చెప్పారు. లెటర్ రాయాలని ఆయన కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో తాగు నీటి కోసం రూ56 వేల కోట్లను ఖర్చుచేస్తున్నారని చంద్రబాబునాయుడు చెప్పారు. అయినా కూడ ఈ స్కీమ్‌లకు నీళ్లు ఎక్కడి నుండి వస్తాయో కూడ తెలియని పరిస్థితి నెలకొందని బాబు సెటైర్లు గుప్పించారు.

రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం కోసం పనిచేద్దామని కోరితే కేసీఆర్ సహకరించలేదన్నారు.కేసీఆర్ ఇంటి నిర్మాణం కోసం రూ. 300 కోట్లు ఖర్చు పెడితే. రాజధాని నిర్మాణం కోసం కనీసం రూ.200 కోట్లు కూడ వద్దా అని బాబు ప్రశ్నించారు.

తెలంగాణలో వేలాది కోట్లు ఖర్చు చేసినా నీళ్లు ఎక్కడి నుండి వస్తాయో కూడ తెలియని పరిస్థితి ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. అయినా కూడ తనకు పరిపాలన గురించి తెలియదని తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడడాన్ని చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు.

వేల కోట్లు ఖర్చు చేసినా కూడ ఉపయోగం లేకుండా పోయిందన్నారు. ఇలా చేసి కూడ తనకు పరిపాలన గురించి తెలియదని కేసీఆర్ మాట్లాడడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎవరికి పరిపాలన తెలియదో దీన్ని బట్టి తేలుతోందని ఆయన ఎద్దేవా చేశారు.