మీరు ఒక్క కేసు పెడితే నేను నాలుగు కేసులు పెడతాను....  ఈ కేసుల వల్ల ఏం ఉపయోగమని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.


అమరావతి: మీరు ఒక్క కేసు పెడితే నేను నాలుగు కేసులు పెడతాను.... ఈ కేసుల వల్ల ఏం ఉపయోగమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.

ఆదివారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు.తెలంగాణ సీఎం కేసీఆర్ బెదిరింపులకు తాను భయపడనని బాబు చెప్పారు. వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. తన జీవితంలో ఎవరికీ భయపడేది లేదన్నారు.

కేసీఆర్ బెదిరింపులకు పాల్పడడం సరైంది కాదన్నారు. బెదిరించి కేసులు పెడతారా అని కేసీఆర్ ను బాబు ప్రశ్నించారు. మీరు ఒక్క కేసు పెడితే నేను నాలుగు కేసులు పెడతానని చంద్రబాబునాయుడు కేసీఆర్ ను హెచ్చరించారు. 

ఈ కేసుల వల్ల ఏం ఉపయోగమని ఆయన ప్రశ్నించారు. మోడీ ప్లాన్ లో భాగంగా కేసీఆర్ తనను విమర్శిస్తున్నారని బాబు చెప్పారు. ఏపీ అభివృద్ధి కాకుండా చేయాలనే ఉద్దేశ్యంతోనే కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.

సంబంధిత వార్తలు

కేసీఆర్‌కు బాబు కౌంటర్: బీజేపీ, వైసీపీలతో కలిసి పోటీ చెయ్యి