Asianet News TeluguAsianet News Telugu

ఎగతాళి చేసేందుకే ఇలా: మోడీపై బాబు ఘాటు వ్యాఖ్యలు

ప్రజలను ఎగతాళి చేసేందుకే బీహార్‌లో ఏపీ గురించి ప్రధానమంత్రి మోడీ మాట్లాడారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు.
 

chandrababunaidu reacts on prime minister modi comments
Author
Amaravathi, First Published May 5, 2019, 1:48 PM IST

అమరావతి: ప్రజలను ఎగతాళి చేసేందుకే బీహార్‌లో ఏపీ గురించి ప్రధానమంత్రి మోడీ మాట్లాడారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు.

ఆదివారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు మాట్లాడే హక్కు మోడీకి లేదని బాబు చెప్పారు. గాయాన్ని మళ్లీ రేకేత్తించేలా మోడీ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.ఏపీ ప్రజలను మోడీ ఎన్నో రకాలుగా ఎగతాళి చేశారని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రధానమంత్రి మోడీ దొడ్డిదారిన వైసీపీని బలపర్చారని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఏపీకి ఇవ్వాల్సిన నిధులను కూడ ఇవ్వలేదన్నారు.  ఏపీపై మూకుమ్మడి దాడికి దిగారని ఆయన ఆరోపించారు. అన్ని ఇబ్బందులు పెట్టి మోడీ ఇప్పుడు మాయ మాటలు చెబుతున్నారని బాబు విమర్శించారు.

2014 ఎన్నికల సమయంలో అభివృద్ధి కావాలా.. అవినీతి కావాలో తేల్చుకోవాలని  మోడీ చేసిన ప్రసంగాలను బాబు గుర్తు చేశారు. వైసీపీ పట్ల ఏ రకంగా బీజేపీ వైఖరి మారిందో ఆయన వివరించారు. మోడీ మాటలకు చేతలకు పొంతన లేదన్నారు. 

తాను పోలవరం వెల్తే తప్పేమిటని బాబు  ప్రశ్నించారు. సోమవారం నాడు తాను పోలవరంలో పర్యటించనున్నట్టు చెప్పారు.విభజనతో ఏపీకి చాలా నష్టం జరిగిందన్నారు. తెలంగాణ కంటే ఏపీ చాలా అభివృద్ధి జరిగిందన్నారు.  ఐదేళ్లలో ఏపీకి మోడీ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.

ఏపీకి ప్రత్యేక హోదాను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని  ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేసింది బీజేపీ కాదా అని ఆయన ప్రశ్నించారు.

ప్రధానమంత్రి మోడీ తన స్థాయిని దిగజారి మాట్లాడుతున్నారన్నారు. మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసిన బీజేపీ... ఆ రాష్ట్రాలకు ప్రత్యేక  రాయితీలు ఇచ్చాయని బాబు గుర్తు చేశారు. ఇలాంటి ప్రాథమిక విషయాలు కూడ మోడీకి తెలియవన్నారు. అవకాశవాద రాజకీయవాదాలకు పాల్పడింది మోడీయేనని బాబు విమర్శించారు. 

సంబంధిత వార్తలు

సైలెంట్ ఓటింగ్, గెలుపు మాదే: చంద్రబాబు
 

Follow Us:
Download App:
  • android
  • ios