Asianet News TeluguAsianet News Telugu

అప్పుడెందుకు మాట్లాడలేదు: మాజీ ఐఎఎస్‌లపై బాబు ఘాటు వ్యాఖ్యలు

 ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్ పునేఠను బదిలీ చేస్తే ఎందుకు మాజీ ఐఎఎస్ అధికారులు ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.

chandrababunaidu reacts on former ias comments in amaravathi
Author
Amaravathi, First Published Apr 17, 2019, 6:07 PM IST

సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.

బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ఆస్తుల కేసులో  ఎల్వీ సుబ్రమణ్యం కేసులో లేదా అని ఆయన ప్రశ్నించారు. పోలింగ్ రోజున డీజీపీ కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎందుకు వెళ్లాడని ఆయన ప్రశ్నించారు. 

తాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంపై చేసిన వ్యాఖ్యలపై  మాజీ ఐఎఎస్ అధికారులు గవర్నర్‌కు ఫిర్యాదుపై ఆయన స్పందించారు. ఏకపక్షంగా రాష్ట్రంలో సీఎస్, ముగ్గురు పోలీసు అధికారులను, ఇంటలిజెన్స్ డీజీని బదిలీ చేస్తే ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పోటీ సాగుతున్న తరుణంలో  జగన్ ఆస్తుల కేసులో ఉన్న అధికారిని అదే రాష్ట్రానికి ఉన్నతాధికారిగా నియమిస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయమై కనీసం తమ అభిప్రాయాన్ని కూడ అడగలేదని బాబు చెప్పారు. ఏకపక్షంగా మాట్లాడడం సరైంది కాదని చంద్రబాబునాయుడు మాజీ ఐఎస్ అధికారుల ఫిర్యాదు గురించి వ్యాఖ్యానించారు.

ఇంట్లో పడుకొంటే ఏం తెలుస్తోందని బాబు మాజీ ఐఎఎస్‌లపై ఘాటుగానే స్పందించారు. ఐదేళ్లుగా ప్రజల కోసం పనిచేస్తే విషయం తెలుస్తోందన్నారు. పోలింగ్ రోజున ఈవీఎంలు పనిచేయకపోతే మాజీ ఐఎఎస్ అధికారులు ఎందుకు స్పందించరని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

గెలిచేస్తున్నాం, వచ్చేస్తున్నాం: వైసీపీపై బాబు సెటైర్లు

 

Follow Us:
Download App:
  • android
  • ios