అమరావతి: ప్రతిపక్షంలో కూర్చోవడం తనకు కొత్తకాదు... మూడో దపా తాను ప్రతిపక్షంలో కూర్చొంటున్నట్టుగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. పోరాటాలు చేయడం కూడ నాకు కొత్తేమీ కాదని ఆయన గుర్తు చేశారు.

ఏపీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఎన్నికైన తర్వాత ఆయనను అభినందిస్తూ ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు గురువారం నాడు ఏపీ అసెంబ్లీ ప్రసంగించారు.
చంద్రబాబునాయుడు మాట్లాడే సమయంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సెటైర్లు వేశారు.ఈ సమయంలో  చంద్రబాబునాయుడు కూడ స్పందించారు.

తనకు పోరాటాలు కొత్త కాదన్నారు. మూడో దఫా ప్రతిపక్షంలో కూర్చొన్నట్టుగా ఆయన చెప్పారు. వాల్యూమ్ పెంచితే తన వాయిస్ పెరుగుతోందని చంద్రబాబునాయుడు చెప్పారు. మీ అందరి కంటే చాలా ఎక్కువగా ఈ అసెంబ్లీలో ఉన్నానని ఆయన గుర్తు చేశా

తమ ప్రభుత్వ హయంలో మైక్‌లు బాగా పనిచేశాయి... మీ హాయంలోనే మైక్‌లు పనిచేయడం లేదని చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు.అయితే ఈ సమయంలో తాను  వివాదాల జోలికిపోదల్చుకోలేదని చంద్రబాబు చెప్పారు.

ఆరు దఫాలు తమ్మినేని సీతారాం ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయాన్ని బాబు  సభలో ప్రస్తావించారు. ఎన్టీఆర్ పిలుపును అందుకొని రాజకీయాల్లోకి వచ్చారని ఆయన గుర్తు చేశారు.శ్రీకాకుళం జిల్లా నుండి ఇప్పటికే ముగ్గురు స్పీకర్లుగా పనిచేశారని ఆయన గుర్తు చేశారు. మీరు చేపట్టే బాధ్యత... మీకు మంచి పేరు తీసుకురావాల్సిన  అవసరం ఉందన్నారు.