అమరావతి:ఏపీ సీఎం వైఎస్ జగన్ కు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆదివారం నాడు లేఖ రాశారు.  వరద బాధితులను ఆదుకొనేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

వరదల నియంత్రణలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు.  ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంానే ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆరోపించారు.

కృష్ణా, గుంటూరు జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులపాలయ్యారన్నారు. అరటి, పసుపు, తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు.రైతులను ఆదుకొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

లంక గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. గోదావరి వరదల కారణంగా నష్టం అంచనాలను త్వరితగతిన పూర్తి చేసి కేంద్రానికి పంపాలని ఆయన డిమాండ్ చేశారు.