ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద 12 గంటల పాటు ధర్నా నిర్వహించనున్నారు.

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద 12 గంటల పాటు ధర్నా నిర్వహించనున్నారు.

ఏపీ భవన్ వేదికగా 12 గంటల పాటు నిర్వహించే ధర్మపోరాట దీక్షలో పలు జాతీయ పార్టీల నేతలు కూడ పాల్గొనే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం నాడు రాత్రిపూట ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

ఏపీలో బాబు దీక్షలో టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. మరో వైపు ఈ దీక్షలో పాల్గొనేందుకు రెండు ప్రత్యేక రైళ్లలో టీడీపీ కార్యకర్తలు, నేతలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రేపు ఉదయానికి టీడీపీ కార్యకర్తలు, నేతలు ఢిల్లీకి చేరుకొంటారు.

ఇదిలా ఉంటే సోమవారం ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు బాబు దీక్ష నిర్వహిస్తారు. ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను టీడీపీ ప్రతినిధి బృందం కలవనుంది.

ఏపీకి పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని బాబు ధర్నా నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

గురువుకు పంగ నామాలు పెట్టారు: మోడీపై బాబు

మామను వెన్నుపోటు పొడవడంలో సీనియర్: బాబుపై మోడీ తీవ్ర వ్యాఖ్యలు