బాబు పెద్ద అబద్దాల కోరు. బడుగు వర్గాల అభివృద్ది ఎక్కడ అని ప్రశ్నించిన పార్థశారథి. మాటలతో కోటలు కడతారని ఆరోపించిన ఎమ్మేల్యే కోనా రఘుపతి

ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ ప‌చ్చి అబద్ధాలే వైసీపి నేత పార్థసారథి ధ్వ‌జ‌మెత్తారు. బాబు పెద్ద మాయ‌గాడని, ఎన్నికలు రాగానే హమీలివ్వడం, అధికారంలోకి వచ్చాక మరిచిపోవడం చంద్రబాబు నైజం అని ఆయ‌న విరుచుకుప‌డ్డారు. సోమవారం వైసీపి నేత‌లు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పాల‌న పై విరుచుకుప‌డ్డారు.


చంద్రబాబు మాట‌ల‌తోనే కోట‌లు కడతారని ఆరోపించారు పార్థ‌సార‌థి. మూడున్న‌రేళ్లుగా రాష్ట్రానికి చేసిన అభివృద్ది ఎక్క‌డ‌ని ఆయ‌న ప్రశ్నించారు. బలహీన వర్గాల కోసం ఇచ్చిన హామీలు అమ‌లు ఎక్క‌డ‌ని ఆయ‌న నిల‌దీశారు. బలహీన వర్గాల కోసం రూ.10 వేల కోట్ల సబ్‌ప్లాన్‌ ఏమైందని అధికార పార్టీని ప్ర‌శ్నించారు. ఇచ్చిన హామీల అమ‌ల పై అడిగితే వారిపై దాడుల‌కు దిగుతున్నార‌ని ఆరోపించారు. రజకులను ఎస్సీల్లో చేర్చాలని డిమాండ్ ను ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌ని ఆయ‌న తెలిపారు. ఇప్పటికే మా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హోంమంత్రి రాజ్‌నాథ్‌ను కలిశారని గుర్తు చేశారు.


నంద్యాల్లో టీడీపీ నేతలు ఓటు వేస్తేనే అభివృద్ది అనే రీతీలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు వైసీపి ఎమ్మెల్యే కోన రఘుపతి. ఉప ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయకపోతే నంద్యాల అభివృద్ధిని ఆపేస్తారా అని ఆయ‌న‌ ప్రశ్నించారు. ప్ర‌జ‌ల‌ను డ‌బ్బుతో కొనుగోలుకు టీడీపీ ప్ర‌లోబాలు పెడుతుంద‌ని ఆయ‌న ఆరోపించారు