Asianet News TeluguAsianet News Telugu

జగన్ ఉచ్చులో పడలేదు, సత్తా చాటుతాం: చంద్రబాబు

కేంద్రప్రభుత్వంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. కర్నూలు జిల్లాలో జరిగిన ధర్మపోరాట దీక్ష వేదిక సాక్షిగా బీజేపీని తూర్పారపట్టారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. పునర్విభజన చట్టంలోని హామీలు అమలు చెయ్యకుండా మెుండి చెయ్యి చూపారాన్నారు. 

Chandrababu warns BJP in Dharma Porata Sabha
Author
Kurnool, First Published Aug 25, 2018, 5:05 PM IST

కర్నూలు: కేంద్రప్రభుత్వంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. కర్నూలు జిల్లాలో జరిగిన ధర్మపోరాట దీక్ష వేదిక సాక్షిగా బీజేపీని తూర్పారపట్టారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. పునర్విభజన చట్టంలోని హామీలు అమలు చెయ్యకుండా మెుండి చెయ్యి చూపారాన్నారు. 

ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన వారిని ఎవర్నీ వదలమని హెచ్చరించారు. ఎన్డీఏ ప్రభుత్వం మెడలు వంచి అన్నీ సాధించుకుంటామన్నారు. గతంలో బ్రిటీష్ వారి గుండెల్లో ఎలా నిద్రపోయామో..నరేంద్రమోదీ గుండెల్లో అలాగే నిద్రపోతామని తెలిపారు. ఆనాడు బ్రిటీష్ వాళ్లతో పోరాడితే.....ఇవాళ ఢిల్లీతో పోరాడుతున్నామన్నారు.  

వెంకటేశ్వరస్వామిని నమ్ముకుంటే వడ్డీతో సహా చెల్లించేలా దీవిస్తారు....అలాగే కేంద్రం ఆలస్యం చేస్తే వడ్డీతో సహా వసూలు చేస్తానని సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వాన్ని మర్యాదగా అడుగుతున్నాం...మాట నిలబెట్టుకోమని సూచిస్తున్నా...లేకపోతే తిరగబడతాం....అప్పటికి మారకోతే తెలుగువాడి సత్తా ఏంటో చూపిస్తామని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రాష్ట్రంలోని 5కోట్ల మంది ప్రజలు సహకరిస్తే కొండను సైతం చీల్చే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.   

రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీలు అవిశ్రాంతంగా పోరాడారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో బొబ్బిలి పులిలా పోరాడారు...ఎక్కడా వెనకడుగు వెయ్యలేదు.....అన్యాయాన్ని ఎండగట్టారన్నారు. అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరీలు తమ కేంద్ర మంత్రి పదవులను సైతం సునాయాశంగా విడిచిపెట్టారన్నారు. 

రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. దేశ చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా నిలదీసిన పార్టీ టీడీపీ అన్నారు. 15 రాజకీయ పార్టీల సహకారంతో 126 మంది ఎంపీలు టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికారని గుర్తు చేశారు. దేశచరిత్రలో ప్రాంతీయ పార్టీ కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం తొలిసారని స్పష్టం చేశారు. 

రాజధాని నిర్మాణానికి 1500 కోట్లు ఇచ్చారు.. ఇతర రాష్ట్రాలకు విచ్చలవిడిగా నిధులిచ్చిన పెద్ద మనిషి ఆంధ్రప్రదేశ్ పై వివక్ష చూపారు. అమరావతి రాజధాని పూర్తైతే కేంద్రప్రభుత్వానికి అత్యధిక ఆదాయం వస్తుంది.....బ్రిటీష్ వాళ్లు దోచుకున్నారు...దోపిడీ చేశారు...ఇప్పుడు బీజేపీ మన కష్టాన్ని దోచుకుంటున్నారు. సహాయం చెయ్యకుండా పన్నులు వసూలు చేస్తారా అని ప్రశ్నించారు. ఇది దుర్మార్గమైన చర్య అని దుయ్యబుట్టారు. 

యమునా నది నుంచి నీళ్లు..పార్లమెంట్ నుంచి మట్టి తీసుకువచ్చారు...మరి ఎందుకు ప్రత్యేక హోదాపై మాటతప్పారు అని ప్రశ్నించారు. ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వరని ప్రశ్నించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే గట్టిగా పోరాడతామని పిడికిలి బిగించి హెచ్చరిస్తున్నానని తెలిపారు.  

పునర్విభజన చట్టంలోని హామీలపై కేంద్రం యూటర్న్ తీసుకుంది. నాది రైట్ టర్న్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో పడింది బీజేపీ మాత్రమేనని తాను కాదన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం వస్తుందన్నారు. ప్రత్యేక హోదాకు14వ ఆర్థిక ప్రణాళిక సంఘం ఒప్పుకోలేదని అసత్యాలు చెప్పారన్నారు. కేంద్రం అంగీకరిస్తే ప్రత్యేక హోదా ఇవ్వొచ్చని కానీ ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. 

తనకు పరిపక్వత లేదని ఆనాడు పార్లమెంట్ లో ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను 1995లోనే ముఖ్యమంత్రి అయ్యానని నాకు పరిపక్వత ఉందో అనుభవం ఉందో ప్రజలకు తెలుసునన్నారు. యునైటెడ్ ఫ్రంట్ పెట్టి ఇద్దరు ప్రధానులను ఎంపిక చేశానని గుర్తు చేశారు. నాకు పరిపక్వత లేదని అనడానికి మోదీ సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. 2002లో సీఎం అయిన మోదీ  తనకు పరిపక్వత లేదా అని మండిపడ్డారు. అదృష్టం బాగుండి మోదీ ప్రధాని అయ్యారన్నారు. గతంలో గుజరాత్ అల్లర్లపై తానే స్పందించానని అల్లర్లకు బాధ్యత వహిస్తూ సీఎం నరేంద్రమోదీని రాజీనామా చెయ్యించాలని ప్రధాని వాజ్ పేయిని కోరానని గుర్తు చేశారు. 

పోలవరం ప్రాజెక్టకు నిధులివ్వకుండా కేంద్రం తాత్సారం చేస్తుందన్నారు. 2వేల ఏడువందల కోట్ల రూపాయలతో తామే పనులు చేపట్టామని తెలిపారు. కేంద్రప్రభుత్వం డీపీఆర్ కూడా ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. విశాఖపట్టణంకు రైల్వే జోన్ ఇవ్వడం లేదన్నారు. అమరావతికి ఆర్థిక సహాయంలో మెుండి చెయ్యి చూపారు. విద్యాసంస్థలు అతీగతి లేదని భూములిచ్చినా కేంద్రప్రభుత్వం నిధులు ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది. గిరిజన యూనివర్శిటీకి ఇంకా అనుమతులు ఇవ్వడం లేదున్నారు. దుగ్గిరాజుపట్నం పోర్టు 6నెలలో ప్రకటిస్తామని చెప్పి ఇప్పటి వరకు ప్రకటించలేదని తెలిపారు. కడపలో ఉక్కు కర్మాగారం ఇస్తామని చెప్పి నేటికి ఇవ్వడం లేదు...కేంద్రానికి చెల్లించాల్సిన పన్నులు పదేళ్లపాటు మాఫీ చేస్తే కడప ఉక్కు కర్మాగారాన్ని తామే నిర్మిస్తామన్నారు. 

బుందేల్ ఖండ్ తరహాలో వెనుకడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని హామీ ఇచ్చారని అది ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. బుందేల్ ఖండ్ తరహాలో ప్యాకేజీ ఇస్తే 24వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. శాసన సభ సీట్లు పెంచాలని వినతిపత్రం ఇస్తే అది కూడా చెయ్యలేదన్నారు. పీడీ అకౌంట్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ నిరూపించాలని డిమాండ్ చేస్తే బీజేపీ నేతలు తోకజాడించారని తిట్టిపోశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

మరోసారి కేంద్రంపై ధ్వజమెత్తిన చంద్రబాబు

చంద్రబాబు మాట: మనిషై పుట్టాక ఆ పని చేయాల్సిందే...

Follow Us:
Download App:
  • android
  • ios