Asianet News TeluguAsianet News Telugu

మరోసారి కేంద్రంపై ధ్వజమెత్తిన చంద్రబాబు

 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 50శాతం గ్రీన్ కవర్ కలిగి ఉండాలన్నలక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కడప జిల్లా యోగి వేమన యూనివర్శిటీలో వనం మనం కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రతీ ఒక్కరూ ప్రకృతితో అనుసంధానం కావాలని పిలుపునిచ్చారు. 
 

Chandrababu blames Centre on bufurcation issues
Author
Kadapa, First Published Aug 25, 2018, 2:52 PM IST

కడప: 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 50శాతం గ్రీన్ కవర్ కలిగి ఉండాలన్నలక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కడప జిల్లా యోగి వేమన యూనివర్శిటీలో వనం మనం కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రతీ ఒక్కరూ ప్రకృతితో అనుసంధానం కావాలని పిలుపునిచ్చారు. 

ప్రకృతితో మమేకం కావాలన్న లక్ష్యంతో 2016 జూలై నెలలో వనం మనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. 33శాతం అడవులున్న కడప జిల్లా అని కొనియాడారు. దేశంలో గ్రీన్ కవర్ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటుందని తెలిపారు. పర్యావరణాన్నికాపాడుకోవాలని....... పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ నడుంబిగించాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.  

రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో సమస్యలు, ఇబ్బందులు వచ్చినా వాటిని ఎదుర్కొన్నాం. కేంద్రం సహకరించినా సహకరించకపోయినా ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నాలుగేళ్లు కేంద్రం సహకరించకుండా మెుండి చెయ్యి చూపిందన్నారు. 

పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చెయ్యలేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిందన్నారు.  అయినా హక్కుల కోసం పోరాడతామని పోరాటంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధనయే తమ లక్ష్యమని తమ పోరాటానికి విద్యార్థులు అండగా నిలవాలని కోరారు. 

భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ ను ఇన్నోవేటివ్ స్టేట్ గా మార్చుకోవాలి..... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉండాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు.  2020 నాటికి మూడు అగ్రరాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంగా ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. అలాగే 2029నాటికి దేశంలోనే అగ్ర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మెుదటి స్థానంలో ఉంటుందన్నారాు. 2050 నాటికి ప్రపంచంలోనే అత్యంత ప్రభావితమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.  

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. అందుకు సాగునీరు అవసరమని గుర్తించి నదులు అనుసంధానానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో 57 ప్రాజెక్టులు ఉంటే వాటిలో 20 ప్రాజెక్టులు పూర్తి చేశామని మరో 20 ప్రాజెక్టులు జూన్ నాటికి పూర్తిచేస్తామని తెలిపారు. మిగిలిన15 ప్రాజెక్టుల పనులను ముమ్మరం చేసినట్లు స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. అనంతపురం జిల్లాలో  కియోమోటార్స్ కంపెనీని తీసుకువచ్చాం. అక్కడ నీరు లేకపోవడంతో నాలుగు నెలల్లోనే హంద్రీనీవాను పూర్తి చేసి గొల్లపల్లి ప్రాజెక్టు ద్వారా నీరందించినట్లు తెలిపారు. జనవరి నెలలో కియోమోటార్స్ వస్తుందన్నారు. 

సులభతరమైన జీవిత విధానానికి సరికొత్త ప్రణాళికతో ముందుకు పోతున్నామని తెలిపారు. సాంకేతికత ఆధారంగా అన్నిపనులు పారదర్శకంగా నేరుగాప్రజలకే అందాలని ప్రయత్నిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. బయోమెట్రిక్ విధానంతో ఎక్కడా అవినీతికి తావులేకుండా కృషి చేస్తున్నామన్నారు. 

గతంలో దెయ్యాలు కూడా పింఛన్లు తీసుకున్నాయని గుర్తు చేశారు. 14 లక్షల ఇళ్లు నిర్మించకుండానే 4 వేల కోట్లు బిల్లులు తినేశారన్నారు. చిత్రావతి నది పనులు పూర్తికాకపోయినా బిల్లులు మాత్రం పూర్తయ్యాయని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో అలాంటి అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.  

 ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థులకు న్యాయం జరిగే వరకు వారి వెన్నంటి నిలిచానని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 100 విద్యార్థులు చదువుతున్న ఆ కళాశాలకు రికగ్నేషన్ క్యాన్షిల్ అయితే ఆ విద్యార్థులను అన్నివిధాలా ఆదుకున్నామన్నారు. 41 మంది విద్యార్థులు డబ్బులు వెనక్కి తీసుకుంటే 39 మంది విద్యార్థులు మళ్లీ చదవి సీటు సంపాదించారని తెలిపారు. 5కోట్ల రూపాయలతో ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థులకు ఉచిత విద్యను అందించే బాధ్యత తమదేన్నారు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 
 
 కడప జిల్లాను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాయలసీమంటే రాళ్ల సీమ కాదని రతనాల సీమ అని నిరూపిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కడప ఎయిర్ పోర్టును అభివృద్ధి చేశామని పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు భూములు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్స్ తీసుకువచ్చామని అలాగే జిల్లాలో 92వేల ఎకరాలకు సాగునీరందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. 

గండి కోట ప్రాజెక్టు వద్ద రెండు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి మరో 50వేల ఎకరాలకు సాగు నీరందించేలా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తొందరలోనే కడప జిల్లా ముఖ చిత్రం మారుస్తామని హామీ ఇచ్చారు. 

కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ ను తీసుకువచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ సాధన కోసం టీడీపీ నేతలు ఆమరణ నిరాహార దీక్ష చేశారని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ వల్ల కేంద్రానికి లాభమే తప్ప ఎలాంటి నష్టం లేదని అయినా కేంద్రం చిన్నచూపు చూస్తుందన్నారు. అత్యధిక ఆదాయం వస్తున్నా కేంద్రప్రభుత్వం పట్టిచుకోకపోవడం అంటే బానిసలుగా బతకాలా అని ప్రశ్నించారు. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రెండు నెలల్లో స్టీల్ ప్లాంట్ పెట్టాలని కేంద్రానికి ఆల్టిమేటం జారీ చేశానని తెలిపిన చంద్రబాబు నాయుడు  ఒకవేళ కంపెనీ పెట్టకపోతే కేంద్రప్రభుత్వం ఇన్సింటేవిస్ ఇస్తే తామే కంపెనీని నిర్మిస్తామన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios