Asianet News TeluguAsianet News Telugu

కేంద్రంపై అమీతుమీ: బీజేపీ అసంతృప్తులకు చంద్రబాబు గాలం

 కేంద్రంపై టీడీపీ అవిశ్వాస తీర్మాణంపై చర్చకు  స్పీకర్ అంగీకరించడంతో  బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న 18 పార్టీల మద్దతు కూడగట్టాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది. బీజేపీలోని మోడీ వ్యతిరేకులను కూడ తమ అవిశ్వాస తీర్మాణానికి  అనుకూలంగా మద్దతు కూడగట్టాలని టీడీపీ భావిస్తోంది.

Chandrababu tries to support from 18 parties for no confidence motion


అమరావతి: కేంద్రంపై టీడీపీ అవిశ్వాస తీర్మాణంపై చర్చకు  స్పీకర్ అంగీకరించడంతో  బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న 18 పార్టీల మద్దతు కూడగట్టాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది. బీజేపీలోని మోడీ వ్యతిరేకులను కూడ తమ అవిశ్వాస తీర్మాణానికి  అనుకూలంగా మద్దతు కూడగట్టాలని టీడీపీ భావిస్తోంది.

కేంద్రంపై అవిశ్వాస తీర్మాణంపై చర్చకు స్పీకర్ అంగీకరించడంతో  ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలను  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు నిశితంగా పరిశీలిస్తున్నారు.  టీడీపీ ఎంపీలతో ఆ పార్టీ అగ్రనేతలు టచ్‌లో ఉన్నారు.

పార్లమెంట్ సాక్షిగా  ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేయడంలో కేంద్రం ఏ రకంగా వైఫల్యం చెందిందనే వివరాలను పార్లమెంట్ వేదికగా చెప్పేందుకు అవసరమైన సమచారాన్ని ఎంపీలకు ఇవ్వాలని  చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. అంతేకాదు పార్టీ వైపు నుండి కూడ ఎంపీలకు అవసరమైన సమాచారాన్ని అందించాలని కూడ బాబు పార్టీ నేతలను ఆదేశించారు.

పార్లమెంట్‌లో చోటు చేసుకొన్న పరిణామాలను మాజీ కేంద్రమంత్రి ఆశోక్‌గజపతిరాజు ఇప్పటికే చంద్రబాబునాయుడుకు పోన్‌లో వివరించారు. మరోవైపు  రానున్న  రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేశారు.

బీజేపీయేతర పార్టీలను అవిశ్వాసం విషయంలో కూడగట్టాలని ఇప్పటికే టీడీపీ నిర్ణయం తీసుకొంది. ప్రధానంగా 18 పార్టీలను అవిశ్వాసానికి మద్దతిచ్చేలా  మరోసారి ప్రయత్నాలను ప్రారంభించాలని చంద్రబాబునాయుడు ఎంపీలను కోరారు.

బీజేపీలోని అసంతృప్త ఎంపీలను కూడ  అవిశ్వాసానికి మద్దతును కూడగట్టాలని  టీడీపీ యోచిస్తోంది. మోడీకి వ్యతిరేకంగా బీజేపీలో ఉన్న శతృఘ్నుసిన్హా లాంటి నేతలను కూడ తమ అవిశ్వాసానికి మద్దతును కూడగట్టాలని టీడీపీ భావిస్తోంది.

ఏపీ విభజన హమీ చట్టం ప్రకారంగా 19 అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని  టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో పాటు ప్రత్యేక హోదా అంశాన్ని కూడ ప్రస్తావించనున్నారు.  అయితే  కేంద్రం ఏ మేరకు రాష్ట్రానికి అన్యాయం చేసిందనే విషయాన్ని పార్లమెంట్‌ సాక్షిగా ప్రస్తావించాలని టీడీపీ భావిస్తోంది. అదే సమయంలో ఏపీలో కూడ ఈ విషయాలపై ప్రజల్లో ప్రచారం చేయాలని ఆ పార్టీ యోచిస్తోంది.

ఏపీలో బీజేపీ కీలక నేతలు కూడ పర్యటిస్తూ రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను కేంద్రం నుండి  వస్తున్నాయని ప్రచారం చేస్తున్నారు. అయితే  ఈ ప్రచారాన్ని కూడ తిప్పికొట్టాలంటే  అంకెలతో  పూర్తి వివరాలను ఎంపీలకు ఇవ్వడంతో పాటు క్షేత్రస్థాయిలో కూడ  ప్రచారం చేయాలని టీడీపీ భావిస్తోంది.

అవిశ్వాసంపై చర్చకు  కేంద్రం సంసిద్దతను ప్రకటించినందున  ఈ పరిణామాలను  బాబు నిశితంగా పరిశీలిస్తున్నారు.  ఈ పరిణామాలను రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు బాబు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios