రాజకీయ కారణాలతోనే చంద్రబాబు యూటర్న్

Chandrababu took U -turn with political reasons: BJP
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ కారణాల వల్లనే యూటర్న్ తీసుకున్నారని బిజెపి అధికార ప్రతినిధి సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ కారణాల వల్లనే యూటర్న్ తీసుకున్నారని బిజెపి అధికార ప్రతినిధి సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు. బిజెపి, టీడిపి పొత్తును విశ్వసించి ప్రజలు అప్పట్లో చంద్రబాబును గెలిపించారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. 

హోదా సాధ్యం కాదనే ఉద్దేశంతోనే కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందని చెప్పారు. ప్యాకేజీతో ఏపీకి మేలు జరుగుతుందని అప్పట్లో చంద్రబాబే ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ఏపీకి కేంద్రం ఎంతో చేసిందని ఆయన అన్నారు.

కాంగ్రెస్‌కు వ్యతిరేక శక్తిగా ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని స్దాపించారని, కానీ చంద్రబాబునాయుడు-కాంగ్రెస్ దోస్తీతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు.  తెలుగుదేశం పార్టీ లాంటి వారసత్వ రాజకీయాలకు తాము స్వస్తి పలుకుతామని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. 

విజయవాడలో మహనాడు ఫ్లెక్సీలు అన్ని వారసత్వంతో నిండిపోయాయని, టీడీపీ తప్పుడు విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన అన్నారు. బీజేపీపై టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొడతామని ఆయన చెప్పారు. చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. 

loader