ఈనెల 18 వ తేదీ నుంచి 26 వరకు చంద్రబాబునాయుడు మూడు దేశాలలో పర్యటిస్తారు. పెట్టుబడుల ఆకర్షణ, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, రాజధాని పరిపాలన నగరం ఆకృతులను ఖరారు చేయడమే లక్ష్యంగా అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంగ్లండ్‌లలో చంద్రబాబు పర్యటించనున్నారు.

ఈనెల 18వ తేదీ నుంచి 20 వరకు అమెరికాలోనూ, 21 నుంచి 23వ తేదీ వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉంటారు. చివరిగా 24 నుంచి 26వ తేదీ వరకు బ్రిటన్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా బ్రిటన్లో ముఖ్యమంత్రి గోల్డెన్ పీకాక్ అవార్డును కూడా అందుకుంటారు. పెట్టుబడుల సాధనే లక్ష్యమని, రాజధాని డిజైన్ల పరిశీలన పేరుతో చంద్రబాబు ఇంకెన్ని దేశాలు తిరుగుతారో చూడాలి.