చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం వికృతమాలలో 2200 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న టీసీఎల్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమిపూజ చేశారు. 158 ఎకరాల్లో నిర్మించనున్న ఈ కంపెనీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 8 వేలమందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

ఈ కార్యక్రమంలో టీసీఎల్ ఛైర్మన్ లీ డాంగ్ షెన్గ్, మంత్రులు నారా లోకేశ్, అమర్‌నాథ్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ గీర్వాణీ, ఎంపీ గల్లా జయదేవ్, టీసీఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరంతిరుపతి రూరల్ మండలం పెద్దిపేటలో 3,300 ఎన్టీఆర్ గృహాలను చంద్రబాబు ప్రారంభించనున్నారు. లబ్ధిదారులకు సీజేఎన్ఎఫ్ పట్టాలను ముఖ్యమంత్రి పంపిణీ చేస్తారు.