2019 ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ నుండి చంద్రబాబునాయుడు పోటీ చేయనున్నారా? పార్టీ వర్గాలు ముఖ్యంగా నంద్యాలలోని టిడిపి నేతలు అవుననే అంటున్నారు. నంద్యాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలంటే వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తే తప్ప సాధ్యం కాదని చంద్రబాబు అనుకున్నారట. దానికితోడు నియోజకవర్గంలోని నేతలు కూడా ఇదే విషయమై చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
నంద్యాల అసెంబ్లీ నుండి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు పోటీ చేయనున్నారా? పార్టీ వర్గాలు ముఖ్యంగా నంద్యాలలోని టిడిపి నేతలు అవుననే అంటున్నారు? నంద్యాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలంటే వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తే తప్ప సాధ్యం కాదని చంద్రబాబు అనుకున్నారట. దానికితోడు నియోజకవర్గంలోని నేతలు కూడా ఇదే విషయమై చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మొన్నటి ఉపఎన్నికల్లో చంద్రబాబు ప్రచారంలో భాగంగా నంద్యాలను కూడా కుప్పంలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.
దానికితోడు మొన్నటి ఎన్నికల్లో గెలిచిన భూమా బ్రహ్మానందరెడ్డి పార్టీలోని సీనియర్లను, అధికారులను కమాండ్ చేసే పరిస్ధితి కూడా లేదు. అందుకనే స్వయంగా చంద్రబాబే ప్రత్యేకంగా నియోజకవర్గంలోని పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇదే విషయమై వచ్చే నెల 7వ తేదీన సిఎం నంద్యాలలో పర్యటిస్తున్నారు. ఇక నుండి నంద్యాలలో పర్యటిస్తుంటానని స్ధానిక నేతలతో చంద్రబాబు చెప్పారట. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం రాష్ట్రానికి ఒక మూలుంటుంది. అదే నంద్యాలైతే కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు కేంద్రం.
అసలే, టిడిపి రాయలసీమలో బాగా వీక్. కాబట్టి, తాను కుప్పం నుండి కదిలి నంద్యాలకు వస్తే కానీ మొత్తం రాయలసీమను గ్రిప్ లోకి తెచ్చుకోవటం సాధ్యం కాదని నంద్యాల నేతలు చేసిన సూచనకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారట. భవిష్యత్తును ఆలోచించే పెట్టుకునే మొన్నటి ఉపఎన్నికల్లో చంద్రబాబు నంద్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టారట. ఇవన్నీ చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నంద్యాలలో పోటీ చేయటం ఖాయమని స్ధానిక నేతలు అనుకుంటున్నారు.
అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటానికి కొడుకు నారా లోకేష్ కు సేఫ్ నియోజకవర్గమే లేదు. కాబట్టి తాను నంద్యాలకు షిఫ్ట్ అయ్యి తన నియోజకవర్గమైన కుప్పంను లోకేష్ కు అప్పగించటమే అన్నీ విధాలా మంచిదని చంద్రబాబు అనుకున్నారట. ఈ పద్దతిలో అయితే ఇద్దరి విజయానికీ ఢోకా ఉండదన్నది చంద్రబాబు ఆలోచన. ఇవే విషయాలు నంద్యాల టిడిపి నేతల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొన్నటి ఉపఎన్నికల్లో టిడిపికి ఒకవిధంగా ఊహించని రీతిలో 27 వేల మెజారిటీ వచ్చింది. ఎన్నికల వ్యవహారం మొత్తం చంద్రబాబు కేంద్రంగానే సాగిన విషయం అందరూ చూసిందే.
రేపటి ఎన్నికలైనా మళ్ళీ అదే పద్దతిలో సాగుతుందనటంలో ఎవరికీ సందేహం లేదు. వచ్చే ఎన్నికల్లో మొన్నటి మెజారిటీకన్నా ఎక్కువ రావాలంటే చంద్రబాబే ఇక్కడ నుండి పోటీ చేయాలని స్ధానిక నాయకత్వం కూడా అనుకుంటున్నారట. సో, ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నంద్యాలలో పోటీ చేయటానికి రెడీ అయినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
