Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ రైతు బంధు తరహాలో చంద్రబాబు స్కీమ్

సోమవారం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు నాయుడు రైతులకు పంటలు వేసే సమయంలో రూ.10వేలు ఆర్థిక సాయం ప్రకటించాలన్న నిర్ణయంపై చర్చించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పంటలు వేసే సమయంలో రైతు బంధు పథకం పేరుతో ఎకరానికి రూ.5వేలు ఆర్తిక సాయం అందజేస్తోంది. 

Chandrababu to announce scheme for farmers
Author
Amaravathi, First Published Jan 21, 2019, 1:20 PM IST

అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే వృద్ధులకు పింఛన్లు రూ.2000కు పెంచిన చంద్రబాబునాయుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 

సోమవారం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు నాయుడు రైతులకు పంటలు వేసే సమయంలో రూ.10వేలు ఆర్థిక సాయం ప్రకటించాలన్న నిర్ణయంపై చర్చించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పంటలు వేసే సమయంలో రైతు బంధు పథకం పేరుతో ఎకరానికి రూ.5వేలు ఆర్తిక సాయం అందజేస్తోంది. 

ఇదే తరహా పథకాన్ని ఏపీలో కూడా అమలు చెయ్యాలని చంద్రబాబు యోచిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి రూ.5వేలు ఇస్తుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం ఎకరానికి రూ.10వేలు ఇచ్చే అంశంపై కూలంకషంగా చర్చిస్తోంది. 

ఎకరానికి రూ.10వేలు ఇవ్వాలా లేక రైతుకు పొలంతో సంబంధం లేకుండా రూ.10వేలు పంట వేసే సమయంలో ఇవ్వాలా అన్న అంశంపై చర్చిస్తున్నారు. అలాగే డ్వాక్రా మహిళలకు వరాల జల్లు కురిపించే అంశంపై కూడా చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. 

డ్వాక్రా మహిళలకు రూ.10వేలు చెల్లింపులపై కూడా చర్చించింది. రెండు విడతలుగా డ్వాక్రా మహిళలకు రూ.10వేలు అందజెయ్యాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. డ్వాక్రా మహిళలకు రుణాల విడుదలపై ఈనెల 26న డ్వాక్రా సంఘాల సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది. 

ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 95 లక్షల మంది డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది.ఇకపోతే కోల్ కతా తరహాలో భారీ బహిరంగ సభను నిర్వహించే యోచనపై కూడా చర్చిస్తున్నారు. 

ఇకపోతే ఈనెల 27న రాజమహేంద్రవరంలో నిర్వహించే ఛలో బీసీ బహిరంగ సభపై కూడా చర్చిస్తున్నారు. అలాగే ఈనెల 30 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు నేతలతో చర్చిస్తున్నారు.   

Follow Us:
Download App:
  • android
  • ios