రాజకీయ గారడీల మనిషి నంద్యాల వచ్చారు. బాబు మూడేళ్ల పాలనపై తీర్పు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. చంద్ర‌బాబువి స్కీమ్‌లుండ‌వు, అన్నీ స్కామ్‌లే.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపించారు వైసీపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఓట్లు వెయ్యకపోతే ఫెన్షన్లను కట్ చేస్తామని, రోడ్లమీద తిరగరాదని బాబు భయపెడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నంద్యాలలో 40 నెలల్లో పూర్తి చేయలేని అభివృద్ధి కార్యక్రమాలను మరో 20 నెలల్లో పూర్తిచేస్తానని చంద్రబాబు చెప్పటంపై ఎమ్మల్యే మండిపడ్డారు. నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పై పాలనపై విరుచుకుపడ్డారు.
రాజకీయ గారడీల మనిషి నంద్యాల వచ్చారని చంద్రబాబును ఉద్దేశించి ఎద్దేవా చేశారు రాచమల్లు. బాబు మూడేళ్ల పాలనపై తీర్పు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మళ్లీ మళ్లీ చంద్రబాబు అవే అబద్ధాలు చెబుతున్నారు. ఆయన మాటలు ఎవరూ నమ్మరని ఆయన పెర్కొన్నారు. చంద్రబాబువి స్కీమ్లుండవు, అన్నీ స్కామ్లే అని ఎద్దేవా చేశారు. ఆయన ఇచ్చిన ఇళ్ల హామీ ఏమైందని ప్రశ్నించారు. చంద్రబాబు కారు షెడ్ స్థలం కంటే తక్కువ స్థలంలో పేదవాళ్లకు ఇళ్లు నిర్మిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
మూడున్నరేళ్లలో చంద్రబాబు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఉప ఎన్నిక సందర్భంగా నాలుగు రోడ్లు పడగొట్టి.. ఈ నాలుగు రోడ్లు కూడా మాకు ఓటేయకపోతే నిలిపివేస్తామని బెదిరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల బలహీనతను ఆసరాగా తీసుకొని వారికి ప్రభుత్వం ద్వారా తీసుకొనే పెన్షన్లు ను నిలుపేస్తామంటూ బెదిరించటం శోచనీయమన్నారు.
