ప్లేటు ఫిరాయించిన చంద్రబాబు..అదే కారణమా ?

ప్లేటు ఫిరాయించిన చంద్రబాబు..అదే కారణమా ?

చంద్రబాబునాయుడుకు కేంద్రంలోని పెద్దలెవరైనా తలంటు పోసారా ? చంద్రబాబు తాజా మాటలు చూస్తుంటే అదే అనుమానాలు మొదలయ్యాయి. గురువారం సాయంత్రం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికి తెలిసిందే. అటువంటిది శుక్రవారం మధ్యాహ్నానికి వచ్చేసరికి పూర్తిగా మాట మార్చేసారు. తాను మాట మార్చేయటమే కాకుండా తన పార్టీ నేతలు ఎవరు కూడా కేంద్రం, పోలవరంపై నోటికి వచ్చింది మాట్లాడవద్దని కట్టడి చేయటంతో అందరిలోనూ ఇపుడదే అనుమానాలు వస్తోంది.

24 గంటలు కూడా కాకముందే చంద్రబాబునాయుడు ప్లేటు తిప్పేయటంతో మంత్రులు, ఎంఎల్ఏలే ఆశ్చర్యపోయారు. కేంద్రంపై విమర్శల పేరుతో ఏదేదో మాట్లాడవద్దంటూ పార్టీ నేతలకు గట్టి హెచ్చరికలు చేశారు. ఈరోజు సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. దానికన్నా ముందుగా ఉదయం టిడిఎల్పీ సమావేశం జరిగింది. అందులో చంద్రబాబు మాట్లాడుతూ మంత్రులు, ఎంఎల్ఏలకు అనేక హెచ్చరికలు చేసారు.

మంత్రులు, ఎంఎల్ఏలు పరిస్ధితులకు అనుగుణంగా రాజకీయాలు చేయాలని చెప్పారు. పోలవరం నిర్మాణం, అభివృద్ధికి చేయూతనివ్వటం కేంద్రం బాధ్యతగా చెప్పటం గమనార్హం. అదే విధంగా రాష్ట్రం అభివృద్ధి జరిగే వరకూ కేంద్రంప్రభుత్వం సహకరించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ వదిలిపెట్టే సమస్యే లేదని చెప్పారు. తాను రియల్ టైం గవర్నెన్సె చేస్తానని, ఎంఎల్ఏలు మాత్రం రియల్ టైం పాలిటిక్స్ చేయాలని పిలుపిచ్చారు. అంటే దానికి అర్ధమేంటో చంద్రబాబే చెప్పాలి. పోలవరం, కేంద్రంపై ఎవరు కూడా నోరు విప్పందని చంద్రబాబు గట్టి వార్నింగులే ఇచ్చారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos