Asianet News TeluguAsianet News Telugu

అమరావతి, పోలవరం లేని రాష్ట్రాన్ని ఊహించలేం.. రైతుల పాదయాత్రకు చంద్రబాబు మద్దతు

అమరావతి 5 కోట్ల ప్రజల  ఆత్మగౌరవానికి ప్రతీక, అమరావతి పరిరక్షణ కోసం రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు సంఘీభావం తెలియజేస్తున్నాని చెప్పారు.  ఇది పాదయాత్ర కాదు, రాష్ట్ర పరిరక్షణ కోసం చేస్తున్న యాత్ర అని చంద్రబాబు అభివర్ణించారు.
 

Chandrababu Supports Amaravathi Farmers
Author
Hyderabad, First Published Nov 1, 2021, 2:26 PM IST

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు .. రైతులకు అండగా నిలిచాడు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించేందుకు అమరావతికి రైతులు భూములు ఇచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత ప్రభుత్వం మారడంతో.. రాజధాని కూడా మారింది. దీంతో.. అక్కడ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈనేపథ్యంలో అప్పటి నుంచి అక్కడి రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. కాగా.. తాజాగా వారంతా మహా పాదయాత్ర చేపట్టారు. వారు  చేపట్టిన పాదయాత్రకు టీడీపీ సంఘీభావం తెలిపింది.

Also Read: అమరావతి రైతుల మహా పాదయాత్రకు రేణుకా చౌదరి సంఘీభావం..

కాగా.. ప్రజలు అమరావతిని కాపాడుకోకపోతే రాష్ట్ర భవిష్యత్ అందకారంగా మారుతుందని.. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ రైతుల పాదయాత్రకు మద్దతు తెలపాలంటూ.. చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.

అమరావతి 5 కోట్ల ప్రజల  ఆత్మగౌరవానికి ప్రతీక, అమరావతి పరిరక్షణ కోసం రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు సంఘీభావం తెలియజేస్తున్నాని చెప్పారు.  ఇది పాదయాత్ర కాదు, రాష్ట్ర పరిరక్షణ కోసం చేస్తున్న యాత్ర అని చంద్రబాబు అభివర్ణించారు.

Also Read: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్...

 రాష్ట్ర భవిష్యత్ కోసం కన్నతల్లి లాంటి భూముల్ని త్యాగం చేసిన పుడమి తల్లి వారసులు చేస్తున్న ఉద్యమం ఇది అని ఆయన అన్నారు.  అమరావతి ఉద్యమంపై పాలక పక్షం ఎన్ని అసత్య ప్రచారాలు, అవహేళనలు, అవమానాలకు గురి చేసినా అద‎రక, బెదరక  అనుకున్న ఆశయ సాధన కోసం, రాష్ట్ర ప్రజానీకం కోసం చేస్తున్న ఉద్యమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన అన్నారు. 

ఈ మహాపాదయాత్ర ద్వారానైనా  పాలకులకు కనువిప్పు కలగాలన్నారు.  అహంకారంతో మూసుకుపోయిన ముఖ్యమంత్రి కళ్లు తెరుచుకోవాలన్నారు.  పగలు, ప్రతీకారాలు,కూల్చివేతలు,రద్దులు పై చూపుతున్న  శ్రద్ద రాష్ట్రాభివృద్ది పై చూపడం లేదన్నారు.

  విభజన జరిగినప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన  ఆంధ్రప్రదేశ్..అమరావతి నిర్మాణంతో స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుతున్న తరుణంలో  3 రాజధానుల పేరుతో రివర్స్ పాలనకు తెరలేపారని ఆరోపించారు..  1999 లో విజన్ 2020 తో నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ది చేసుకున్నామని చెప్పారు.

  విభజన అనంతరం విజన్ 2029 లో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అమరావతితో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్దికి నాంది పలికామని చెప్పారు.  ఓ వైపు ‎ విజన్ 2020 ఫలితాలు చూసి  సంతోషం కలుగుతున్నా...మరో వైపు విజన్ 2029 ప్రణాళికల అమలుపై గొడ్డలివేటుతో బాధగలుతోందన్నారు.

ఎప్పుడూ ప్రజల భవిష్యత్ కోసం ఆలోచించి ముందు చూపుతో నిర్ణయాలు తీసుకునే వారే నాయకుడు అని చంద్రబాబు చెప్పారు.అమరావతి, పోలవరం లేని రాష్ట్రాన్ని ఊహించలేమన్నారు.  అమరావతిని కాపాడుకోలేకపోతే రాష్ట్రం అంధకారమవుతుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ పాదయాత్రకు ప్రజలు, ప్రజాసంఘాలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర అభివృద్దిని కాంక్షించే ప్రతిఒక్కరూ మద్దతు తెలపాలని కోరారు.  5 కోట్ల ప్రజల గుండె చప్పుడు, ‎తెలుగు జాతి అఖండ జ్యోతి అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios