అమరావతి: మూడు రాజధానులు, సీఆర్డిఏ రద్దు బిల్లులను టీడీపీ సభ్యులు అడ్డుకున్న తర్వాత శాసన మండలి నుంచి బయటకు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు అమరావతి రైతులను పలకరించారు.  బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ చైర్మన్ నిర్ణయం తీసుకున్న తర్వాత శాసన మండలి నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు. గ్యాలరీలో కూర్చుని శాసన మండలిలో బిల్లులపై జరుగుతున్న చర్చలను వీక్షించారు. 

శాసన మండలి నుంచి బయటకు వచ్చిన చంద్రబాబుపై అమరావతి ప్రాంత గ్రామాల ప్రజలు పూలవర్షం కురిపించారు. సభ ముగిసిన తర్వాత బుదవారం రాత్రి ఆయన మందడం మీదుగా ఇంటికి వెళ్తుండగా ప్రజలు స్వాగతం చెప్పారు. జై అమరావతి, జైజై అమరావతి అటూ నినాదులు చేస్తూ బాణసంచా కాల్చారు 

Also Read:సెలెక్ట్ కమిటీకి బిల్లులు: వైఎస్ జగన్ తో విజయసాయి భేటీ, ఏం చేద్దాం?

తన కారు నుంచి చంద్రబాబు దిగి విజయసంకేతం చూపించారు. చంద్రబాబుకు వారు శాలువా కప్పి ఆయనను సత్కరించారు. అదే మార్గంలో వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణను కూడా అభినందించారు. ఆ తర్వాత ఇదే మార్గంలో లోకేష్,  నిమ్మల రామానాయుడు, పయ్యావులు కేశవ్, గద్దె రామ్మోహన్, బచ్చుల అర్జునుడు తదితరులు కూడా గ్రామప్రజలు పూలు చల్లారు. 

ప్రతి ఇంటి ముందు ప్రజలు అభివాదం చేశారు. సెల్ఫీలు దిగారు. తనకు ధన్యవాదాలు తెలిపిన ప్రజలను ఉద్దేశించి నారా లోకేష్ తనకు కాదు, మండలి చైర్మన్ కు ధన్యావాదాలు తెలపాలని చెప్పారు. 

Also Read: సెలెక్ట్ కమిటీకి వికేంద్రీకరణ బిల్లు... లోకేష్ పై మంత్రి అనిల్ దాడికి యత్నం: యనమల