అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరు, పోలింగ్ సరళిపై శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. 

అయితే ఈ సమీక్షకు శ్రీకాకుళం సిట్టింగ్ ఎమ్మెల్యే గుండాలక్ష్మీదేవి హాజరుకాకపోవడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. సమీక్షకు సంబంధించి షెడ్యూల్ ముందే విడుదలైనప్పటికీ ఎమ్మెల్యే హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అయితే ఎమ్మెల్యే గుండా లక్ష్మీ దేవి కుటుంబ సభ్యుడు చనిపోవడంతో సమీక్షకు హాజరు కాలేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే హాజరుకాకపోవడంతో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబందించి కీలక నేతలు ఎవరూ హాజరుకాకపోవడంతో మరింత రెచ్చిపోయారు చంద్రబాబు. ఇది పద్థతికాదంటూ క్లాస్ పీకారు. టీడీపీ నేతలు క్రమశిక్షణతో మెలగాలని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలంటూ హితవు పలికారు.