సోనియా-జగన్ కుమ్మక్కయ్యారా ?

సోనియా-జగన్ కుమ్మక్కయ్యారా ?

‘రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర ముసుగేసుకుని సోనియాగాంధితో కుమ్మకై బెయిల్ తెచ్చుకున్నారు’..ఇవి జగన్మోహన్ రెడ్డి గురించి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యమైనది. ప్రత్యేకహోదా, కేంద్రం వైఖరి, వైసిపి ఎంపిల రాజీనామా తదితరాలపై అందుబాటులో ఉన్న మంత్రులు, నేతలతో బుధవారం చంద్రబాబు సమీక్షించారు. ఆ సందర్భంగా చేసినవే పై వ్యాఖ్యలు. ఎదుటివారిపై బురద చల్లే కార్యక్రమంలో చంద్రబాబు, టిడిపి నేతలు ఎంత ఘటికులో తెలియ చేయటానికి పై వ్యాఖ్యలే నిదర్శనం.

చంద్రబాబు చెప్పినట్లు నిజంగానే సోనియాగాంధితో జగన్ కుమ్మక్కయ్యారా? అనే విషయాన్ని ఆలోచిద్దాం. సోనియా తో జగన్ కుమ్మకైతే అసలు కాంగ్రెస్ లో నుండి జగన్ బయటకు రావాల్సిన అవసరం ఏమోచ్చింది? ఏ కేంద్రమంత్రి పదవో తీసుకుని ఎంచక్కా పవర్ ఎంజాయ్ చేసుండేవారు కదా? అదే జరిగుంటే వైసిపి ఆవిర్భావమే జరిగుండేది కాదు కదా? అసలు జగన్ పై సిబిఐ, ఈడి కేసులు ఎందుకొచ్చాయి? 18 మాసాల జైలు జీవితం గడపాల్సిన అవసరం జగన్ కు ఎప్పుడొచ్చింది?

సోనియా గాంధికి ఎదురుతిరిగినందుకే కదా జగన్ కు సమస్యలు మొదలయ్యాయి? సిబిఐ, ఈడి నమోదు చేసిన కేసులు కానీ కోర్టులో విచారణలో కానీ కాంగ్రెస్, టిడిపి నేతలు కలిసే వేసింది? మూడు నెలల్లో బెయిల్ తీసుకుని బయటకు రావాల్సిన జగన్ ఏకంగా 18 మాసాలు జైల్లోనే ఎందుకు గడపాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు చంద్రబాబునాయుడు సమాధానాలిస్తే అపుడు సోనియా-జగన్ కుమ్మక్కయ్యారని జనాలు ఒప్పుకుంటారేమో?

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos