జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ విమర్శలు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. విశాఖపట్నంలో మంగళవారం సాయంత్రం జరిగిన ధర్మ పోరాట సభలో ఆయన మాట్లాడారు.
వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే వడ్డీతో సహా అపరాధం చెల్లించుకోవాల్సి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. టీటీడీపై లేనిపోని అనుమానాలు సృష్టించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనకు వెంకటేశ్వరస్వామిపై చాలా భక్తి అని, వెంకటేశ్వరస్వామి తనను ఎప్పుడూ ఆశీర్వదిస్తున్నారని, ఆ రోజు బ్రహ్మోత్సవాల సమయంలో ప్రభుత్వ లాంఛనాలు తీసుకు వెళ్తుంటే 24 గ్లేమోర్ మైన్స్ తనపై పేల్చినప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వరస్వామే తన ప్రాణాలు కాపాడాడని అన్నారు.
ఏదో ప్రయోజనం కోసంమే తనతో ఏదో ఒక పనిచేయించాలని తనను శ్రీవారు కాపాడాడని ఆయన అన్నారు. ఎవరైనా మొక్కు కోరి ఒక్క రూపాయి అయినా ఇవ్వకపోయినా ఆయన వదిలిపెట్టరని, ఆయనకు అపచారం తలపెట్టిన వాడు ఈ జీవితంలోనే తప్పకుండా శిక్ష తీసుకుంటాడని అన్నారు.
ఆ రోజు ఎన్టీఆర్ చూపిన క్రమశిక్షణే వెంకటేశ్వరస్వామి ఆలయం శుభ్రతకు కారణమని చెప్పారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా తాను చేసిన విధానమని ఆయన అన్నారు.
ప్రధాన అర్చకునితో తప్పుడు సమాచారం చెప్పించుకొనే పరిస్థితికి వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధానార్చకుడు కూడా తన ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫొటో పక్కన రాజశేఖర్ రెడ్డి ఫొటో పెట్టుకొనే పరిస్థితికి వచ్చాడని ఆయన అన్నారు.
ఎప్పుడో 1952లో గులాబీ రంగు వజ్రం పోయిందని, అన్నీ రికార్డులన్నీ ఎస్టాబ్లిస్ చేశారని చంద్రబాబు అన్నారు. చాలాసార్లు రిపోర్టు కూడా వేశారని, జగన్నాథరావు కమిషన్ కూడా వేశారని, దాంతో ఆగకుండా ఇంకో కమిటీ కూడా వేశారని అంటూ ఇది వజ్రం కాదు, కెంపు మాత్రమే అని ఆ రెండు కమిటీలు 2011లోనే చెప్పాయని ఆయన అన్నారు. కృష్ణారావు ఆనాడు ఈవోగా ఉన్నాడనిస అది వజ్రం కాదు, కెంపు మాత్రమే అని ఆ రోజు ఆయన ప్రభుత్వానికి నివేదిక సమర్పించారని చంద్రబాబు వివరించారు.
