విశాఖపట్టణం: డ్వాక్రా సంఘాల సభ్యులకు  ఆర్థిక సహాయం చేయడాన్ని విమర్శించే వారిని చిత్తు చిత్తుగా ఓడించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోరారు.శుక్రవారం నాడు విశాఖలో జరిగిన డ్వాక్రా సంఘాల సభ్యుల సమేశంలో ఏపీ సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

విమర్శలు చేసే వారిని చిత్తు చిత్తుగా  చితక్కొట్టాలన్నారు. రాష్ట్రంలోని ఆడబిడ్డలను ఆదుకొంటానని చెప్పారు. మీరు అడగకుండానే 9400 కోట్లు ఇస్తున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు.

తన వద్ద డబ్బులు లేవన్నారు. అందుకే  మూడు చెక్కులను ఇస్తున్నట్టు ఆయన తెలిపారు.వచ్చే ఎన్నికల్లో సైన్యంలా పనిచేయాలని బాబు కోరారు. చెక్‌ల పంపిణీని కూడ వైసీపీ విమర్శిస్తోందన్నారు.గతంలో కూడ ఇలాగే గ్యాస్ సిలిండర్ల పథకాన్ని విమర్శిస్తే 1998లో కూడ మీరంతా చిత్తు చిత్తుగా ఓడించారని బాబు ఎద్దేవా చేశారు.

ఆర్థిక అసమానతలను  తగ్గించేందుకు ప్రయత్నించనున్నట్టు చెప్పారు.పేద పిల్లలు విదేశాల్లో చదువుకొనేందుకు వీలుగా  ఆర్థిక సహాయం చేస్తున్నట్టు చెప్పారు.