పవన్ ఎందుకు మాట్లాడుతున్నారో, జగన్ దొంగలెక్కలతో అడ్డంగా దొరికిపోయాడు: బాబు

Chandrababu retaliates Pawan and YS Jagan
Highlights

లేని శ్రీవారి నగలు, వజ్రాలు మాయమయ్యాయని మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 

ఏలూరు: లేని శ్రీవారి నగలు, వజ్రాలు మాయమయ్యాయని మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బిజెపి, వైసిపితో కలిసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మాట్లాడుతున్నారని, పవన్ కల్యాణ్ అలా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియడం లేదని ఆయన అన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు బహిరంగ సభలో ఆయన మంగళవారం ప్రసంగించారు. అనుభవం లేని జగన్ దొంగ లెక్కలు చూపించి అడ్డంగా దొరికిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.  ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తామని ఆయన చెప్పారు. 

కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం కేంద్రం నిధులు తమకు అవసరం లేదని, తామే ఉక్కు కర్మాగారం నిర్మించుకుంటామని చంద్రబాబు చెప్పారు. కొల్లేరు మదింపు సమస్యను త్వరలో పరిష్కరిస్తానని చెప్పారు. కొల్లేరు ప్రజలు, మత్స్యకారుల సమస్సయను పరిష్కరిస్తానని చెప్పారు. 

2019 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ప్రత్యేక హోదాకు సమానంగా పదేళ్ల పాటు కేంద్రం రాష్ట్రానికి  రాయితీలు ఇవ్వాలని ఆయన అన్నారు. 

loader