ప్రజల కోసం పోరాడే వ్యక్తిత్తవం, ఆపన్నలకు అండగా నిలిచే భరోసా ఇచ్చే గుండె ధైర్యం కోడెల శివప్రసాదరావు సొంతమని టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. నేడు కోడెల జయంతి కాగా.. ఈ సందర్భంగా ఆయనను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో.. ట్విట్టర్ లో షేర్ చేశారు. కోడెల చేసిన సేవలను పొగుడుతూనే.. ఆయన చావుకి వైసీపీ నేతలు పరోక్షంగా కారణమంటూ విమర్శించారు.

‘‘ప్రజల కోసం పోరాడే వ్యక్తిత్వం, ఆపన్నులకు అండగా నిలిచి భరోసా ఇచ్చే గుండె ధైర్యం కోడెల శివప్రసాద్ గారి సొంతం. ఈ లక్షణాలే రూపాయి డాక్టరుగా పేదలకు వైద్య సేవలందిస్తోన్న కోడెలను ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రమ్మని పిలిచేలా చేశాయి. ప్రజల్లో కోడెలను పల్నాటి పులిగా నిలిపాయి’’అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

మరో ట్వీట్ లో .. ‘‘అలాంటి వ్యక్తి కుటుంబంపై 19 కేసులు పెట్టి, వైసీపీ నేతలంతా కాకుల్లా పొడుచుకుతిన్నారు.  మానసికంగా కృంగదీసి ఆత్మహత్యకు పాల్పడేలా చేసారు. వైసీపీ క్రూర రాజకీయానికి కోడెల మృతి ఒక ఉదాహరణ. ఈరోజు కోడెల శివప్రసాద్ గారి జయంతి సందర్భంగా ఆయన ప్రజాసేవలను మననం చేసుకుందాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.