Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు: రామ్ నాథ్ కోవింద్ తో భేటీ, వైసీపీపై ఫిర్యాదు

తమ పార్టీ కార్యాలయాలపై దాడుల మీద, తమ పార్టీ నేతల అక్రమ నిర్బంధాల మీద ఫిర్యాదు చేయడానికి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవతి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేయనున్నారు. ఆయన ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.

Chandrababu reaches Felhi to meet Ramanath Kovind
Author
New Delhi, First Published Oct 25, 2021, 10:47 AM IST

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్ననం 12.30 గంటలకు ఆయన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలుసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపీ) కార్యకర్తల దాడులపై ఆయన రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆయన చెప్పనున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కోరుతారు. తమ పార్టీ కార్యాలయాలపై, తమ పార్టీ నాయకులపై పెట్టిన కేసులపై Chandrababu రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేస్తారు. ఢిల్లీలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడానికి ఆయన ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.

Also Read: టీడీపీ కార్యాలయాలపై దాడులు: మరో అరుగురి అరెస్ట్.. మిగిలిన వారి కోసం తీవ్ర గాలింపు

టీడీపీ నేతల అక్రమ నిర్బంధాలపై, వైసీపీ కార్యకర్తల దాడులపై సిబిఐ విచారణ జరిపించాలని కూడా ఆయన Ramnath Kovindను కలవనున్నారు. టీడీపీ నాయకుడు పట్టాభి ముఖ్యమంత్రి YS Jagan మీద చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై దాడులు చేశారు. దాంతో రాష్ట్రం ఒక్కసారిగా అట్టుడికింది. వైసీపీ కార్యకర్తల దాడులకు నిరసనగా టీడీపీ ఓ రోజు రాష్ట్ర బంద్ పాటించింది. 

ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు 36 గంటల నిరసన దీక్ష చేపట్టారు. దానికి ప్రతిగా వైసీపీ నేతలు జనాగ్రహదీక్షలు చేపట్టారు. ఇరు పార్టీల నాయకులు తీవ్రమైన పదజాలంతో పరస్పరం దూషించుకున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ పెద్దలను కలవాలని నిశ్చయించుకున్నారు. వైఎస్ జగన్ మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన బెయిల్ మీద విడుదలయ్యారు. వైసీపీ కార్యకర్తల తీరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వ్యతిరేకించారు.

Also Read: 'బోసడీకే'... ఆ మాటకు తెలంగాణ పదకోశంలో అర్ధం ఇదే: అయ్యన్నపాత్రుడు

అయితే, ముఖ్యమంత్రినైన తననే కాకుండా తన తల్లిని కూడా అసభ్యకరమైన పదజాలంతో పట్టాభి దూషించారని వైఎస్ జగన్ అన్నారు. పోలీసుల అమరవీరుల దినోత్సవ సభలో ఆయన తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. టీడీపీ కార్యాలయాలపై దాడులకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేశారు. పట్టాభి ఇంటిపై దాడి సంఘటన మీద కూడా కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లో పోలీసులు 21 మందిని అరెస్టు చేశారు. మరింత మంది నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు మంగళగిరిలోని టీడీీప కార్యాలయం సీసీటీవీ ఫుటేజీలను సమర్పించాలని పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios