కేంద్రం భయపడి ముందుకు వస్తోంది: చంద్రబాబు

Chandrababu press meet on schemes
Highlights

కేంద్రం భయపడి  ఇప్పుడు ఇవ్వడానికి ముందుకు వస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 

అమరావతి: కేంద్రం భయపడి  ఇప్పుడు ఇవ్వడానికి ముందుకు వస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నీ ఇవ్వడం లేదని, ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఒకటి రెండు ఇవ్వడానికి ముందుకు వస్తోందని ఆయన అన్నారు. 

కేంద్రం మొండి చూపించినా ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, సంస్థలను వేటినీ ఇవ్వడం లేదని ఆయన అన్నారు.  తాము అమలు చేసిన, చేస్తున్న పథకాల గురించి ఆయన శనివారం మీడియా సమావేశంలో వివరించారు. 

అమరావతికి ఆరు నెలల్లో ఓ రూపం వస్తుందని చెప్పారు. తమను విశ్వసించి రైతులు అమరావతికి 34 వేల ఎకరాలు ముందుకు వచ్చారని ఆయన అన్నారు. అమరావతిపై ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆసక్తి చూపుతున్నారని ఆయన చెప్పారు.

పోలవరం ప్రాజెక్టును 57 శాతం పూర్తి చేయగలిగామని ఆయన చెప్పారు. పట్టుదల, స్థిరచిత్తం వల్లనే అది సాధ్యమైందని ఆయన అన్నారు. పోలవరం కోసం తాను చేసిన కృషిని వివరించారు. 

పార్టీపరంగా మ్యానిఫెస్టో విడుదల చేశామని, దాన్ని అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. తమది అత్యుత్తమ జట్టు అని ఆయన చెప్పారు. ఐదు నెలల్లో పూర్తి కాని పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ఆయన అన్నారు. అపవాదు లేకుండా అన్ని కార్యక్రమాలను అమలు చేస్తామని చెప్పారు. 

జనవరి కల్లా అన్ని పనులను సాధ్యమైనంత వరకు పూర్తి చేసి, భవిష్యత్తులో ఏం చేయాలో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

loader