లోకసభలో అవిశ్వాసంపై జరుగుతున్న చర్చను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యక్ష ప్రసారం వీక్షిస్తున్నారు. తన కార్యాలయంలో కూర్చుని ఆయన టీవీ చూస్తున్నారు.
అమరావతి: లోకసభలో అవిశ్వాసంపై జరుగుతున్న చర్చను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యక్ష ప్రసారం వీక్షిస్తున్నారు. తన కార్యాలయంలో కూర్చుని ఆయన టీవీ చూస్తున్నారు. లైవ్ చూస్తూ తెలుగుదేశం పార్టీ ఎంపీలకు ఆయన సూచనలు చేస్తూ వచ్చారు.
ఎంపీ గల్లా జయదేవ్ చేసిన ప్రసంగాన్ని చంద్రబాబు అభినందించారు. వాస్తవాలను అంకెలతో సహా దేశ ప్రజలకు తెలియజేశామని అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశం దృష్టికి తెచ్చారని కొనియాడారు.
ఎంపీ రామ్మోహన్‌నాయుడి ప్రసంగంలో మరింత భావోద్వేగం ఉండాలని సూచించారు. అవిశ్వాసంపై చర్చలో వీలైనంత మంది మాట్లాడాలని ఆయన చెప్పారు. రాష్ట్రం ఎదుర్కొన్న ప్రతి సమస్యనూ వివరించాలని అన్నారు. ఇదొక అద్భుత అవకాశమని, చారిత్రాత్మక సందర్భమని ఆయన ఎంపీలతో అన్నారు.
