షారుఖ్ ను అభినందించిన చంద్రబాబు..ఎందుకో తెలుసా ?

షారుఖ్ ను అభినందించిన చంద్రబాబు..ఎందుకో తెలుసా ?

బాలివుడ్ ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్ ను చంద్రబాబునాయుడు అభినందించారు. షారుఖ్ కు చంద్రబాబుకు ఏమిటి సంబంధమని అనుకుంటున్నారా? ఉందిలేండి. వీరిద్దరూ దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో కలుసుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే, షారుఖ్‌ను దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రత్యేక అవార్డుతో సత్కరించింది. బాలలు, మహిళల హక్కుల కోసం ఆయన చేస్తున్న సేవలకుగాను ఆయన్ను క్రిస్టల్ అవార్డుతో గౌరవించింది. సోమవారం జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో షారుఖ్ ఈ అవార్డును స్వీకరించారు.

One need not be a politician to be a great leader and lead the society towards a better tomorrow.
Congratulations @iamsrk on being awarded @wef's 24th crystal award. Your dedicated efforts for Women’s and Children’s rights are commendable.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా షారుఖ్‌ను అభినందించారు. ‘సమాజానికి సేవ చేసేందుకు ఓ రాజకీయ నాయకుడో,  గొప్ప నేతో కానక్కర్లేదు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం నుంచి క్రిస్టల్ అవార్డు అందుకున్నందుకు అభినందనలు’. ‘మహిళలు, బాలల హక్కుల కోసం మీరు చేస్తున్న కృషి ప్రశంసించదగినది’. అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. షారుఖ్ తన మీర్ ఫౌండేషన్ ద్వారా యాసిడ్ దాడులకు గురైన మహిళలకు సహాయ, సహకారాలు అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కేన్సర్ బాధిత చిన్నారులను కూడా షారుఖ్ ఆదుకుంటున్నారు. అందుకే వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఘనంగా సత్కరించింది.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page