తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిన్న జరిగిన ఘటనపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు  ఫోన్ లో  మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు.

ఇసుక సరఫరా విషయంలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి డబ్బులు వసూలు చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై  ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన అనుచరులు గురువారం నాడు వచ్చారు. జేసీ అనుచరుడు కిరణ్ పై దాడికి దిగారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి కూర్చొనే కుర్చీలో పెద్దారెడ్డి కూర్చొని హల్ చల్ చేశారు.ఈ విషయం తెలిసిన జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు కూడా వెంటనే అక్కడికి చేరుకొన్నారు. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకొన్నారు.

also read:తాడిపత్రి ఘటన: జేసీ వర్గీయులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

ఈ విషయమై  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఇవాళ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి ఫోన్ చేశారు. గురువారం నాడు ఏం జరిగింది, ఘటనకు దారి తీసిన పరిస్థితులను  వాకబు చేశారు.

జేసీ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబునాయుడు చెప్పారు. తాడిపత్రిలో జరిగిన ఘటనపై వైసీపీ కార్యకర్త మనోజ్ ఫిర్యాదుపై జేసీ వర్గీయులపై పోలీసులు ఇవాళ కేసు నమోదు చేశారు.