Asianet News TeluguAsianet News Telugu

ఆ హక్కులను కాపాడండి...సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ

 గతంలో టిడిపి ప్రభుత్వం తెచ్చిన జివో నెం 3 ప్రయోజనాలు కాపాడాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్ ను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.

Chandrababu Naidu writes letter to CM Jagan
Author
Amaravathi, First Published Jun 19, 2020, 10:38 AM IST

అమరావతి: గతంలో టిడిపి ప్రభుత్వం తెచ్చిన జివో నెం 3 ప్రయోజనాలు కాపాడాలని... షెడ్యూల్ ఏరియాలో టీచర్ పోస్టులు గిరిజనులకే దక్కేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్ ను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కోరారు. రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ది లోపం గిరిజనులకు శాపంగా మారిందన్నారు. ఈ మేరకు జీవో నెం 3కి సంబంధించిన విషయాలు, గిరిజన యువత ఉద్యోగాలకు సంబంధించి సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ రాశారు.  

''వైసిపి ఉదాసీనత వల్లే బీసిల సాధికారతకు విఘాతం కలిగింది. వైసిపి చిత్తశుద్దిలోపం వల్లే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 34%నుంచి 24%కు కోత వేశారు.  జీవోఎంఎస్ నెం 3 ప్రయోజనం కాపాడి గిరిజన సాధికారతకు దోహదపడాలి'' అని చంద్రబాబు లేఖలో పేర్కోన్నారు.

''గిరిజనుల హక్కుల రక్షణలో రాష్ట్ర ప్రభుత్వంలో చిత్తశుద్ది లోపం కనిపిస్తోంది. తద్వారా గిరిజన పురోగతి, సాధికారతకు విఘాతం కలుగుతోంది. షెడ్యూల్ ఏరియాలో ఉపాధ్యాయ పోస్టులను స్థానిక గిరిజనులతోనే భర్తీ చేయాలని... అందులో కూడా 33% మహిళలకే ఇవ్వాలని టిడిపి ప్రభుత్వం 2000సంలో జీవోఎం ఎస్ నెం 3/ 10.01.2000 తెచ్చింది. రెండు దశాబ్దాల పాటు ఈ జీవో అమల్లో ఉంది. దానివల్ల అనేకమంది గిరిజన యువతకు ఉద్యోగాలు దక్కాయి. ఇప్పుడా గిరిజనులంతా ఉపాధ్యాయ ఉద్యోగాలను షెడ్యూల్ ఏరియాలో కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది గిరిజనాభివృద్దిపై తిరోగమన ప్రభావం చూపనుంది'' అని అన్నారు. 

READ MORE   ఏపీలో నేడే రాజ్యసభ ఎన్నికలు: ఓటేసిన సీఎం వైఎస్ జగన్

'' ఈ సందర్భంగా హాకీ ఛాంపియన్ మరియు రాజ్యాంగ సభ సభ్యుడైన జైపాల్ సింగ్ ముందా వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నాను. ''గిరిజనేతర జాతుల నిరంతర దోపిడి, అణిచివేతతో మా గిరిజన చరిత్రకు నిరంతరం విఘాతం కల్గుతోంది. అదే అంశాన్ని జవహర్ లాల్ నెహ్రూ దృష్టికి తేగా, ఇకపై మనం కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దాం, స్వతంత్ర భారత చరిత్ర అనే నూతన అధ్యాయంలో అందరికీ సమానహక్కులు ఉంటాయి,ఏ ఒక్కరూ నిర్లక్ష్యానికి గురికాని నూతన అధ్యాయానికి శ్రీకారం చుడదామని అన్నారు.  గిరిజనులందరికి సమాన అవకాశాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది, ఏ గిరిజనుడు భవిష్యత్తులో దోపిడికి, అణిచివేతకు గురికారాదు'' అని   ముందా పేర్కొన్నారు'' అని చంద్రబాబు గుర్తుచేశారు. 

''ఇతరులతో ధీటుగా గిరిజనులు అభివృద్ది చెందేలా చూడటం, గిరిజన సాధికారత సాధించడం మన రాజ్యాంగం ఇచ్చిన హామీ. టిడిపి ప్రభుత్వం ఈ రాజ్యాంగ హామీకి కట్టుబడే టిడిపి ప్రభుత్వం 2000సంలో  జీవో ఎంఎస్ నెం 3ని గిరిజనుల కోసం తెచ్చింది. రాష్ట్రంలో బలహీన వర్గాల సాధికారతలో, అణగారిన వర్గాల హక్కులు కాపాడేందుకు గత ఏడాదిగా రాష్ట్ర ప్రభుత్వం విముఖంగా ఉన్నట్లు కనబడుతోంది'' అని ఆరోపించారు. 

''దీనికి ముందు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో  బీసి రిజర్వేషన్లను 34%నుంచి 24%కు తగ్గించడంతో బీసిలంతా సాధికారత కోల్పోయారు. స్థానిక ఎన్నికల్లో బిసిల రిజర్వేషన్లు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా వ్యవహరించి షెడ్యూల్ ఏరియాలో టీచింగ్ పోస్టులను జీవో ఎంఎస్ నెం 3 ప్రకారం గిరిజనులకే దక్కేలా సరైన చర్యలను తక్షణమే చేపట్టాలి. రాష్ట్రంలో గిరిజన సాధికారతకు దీనిని కీలకాంశంగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నాను'' అని జగన్ కు రాసిన లేఖలో చంద్రబాబు పేర్కోన్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios